పటాకులు పేల్చి ఏటీఎంను పగులగొట్టిన దొంగలు.. నాలుగు చోట్ల చోరీ.. లక్షలు లూటీ..

లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.. నాలుగు చోట్లా దోపిడీ అనంతరం దొంగలు ఏటీఎం మిషన్లు, సీసీ కెమెరాలకు నిప్పు పెట్టారు. పక్కా ప్రణాళికతో ఒకే సారి నాలుగు చోట్ల దోపిడీలు చేశారు.

పటాకులు పేల్చి ఏటీఎంను పగులగొట్టిన దొంగలు.. నాలుగు చోట్ల చోరీ.. లక్షలు లూటీ..
Atm
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 14, 2023 | 9:07 AM

దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఏటీఎంలనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. ఏటీఎంను పగులగొట్టి చోరీకి యత్నించారు. పటాకులు పేల్చి ఏటీఎంను ధ్వంసం చేశారు. కానీ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయలేదు. అలారం మోగటంతో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంను దుండగులు ధ్వసం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలైలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఏకంగా నాలుగు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు రూ.75 లక్షలకు పైగా ఎత్తుకెళ్లినట్టుగా తెలిసింది. గ్యాస్ కట్టర్‌తో యంత్రాలను కట్‌చేసి డబ్బులు దోచుకున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు దొంగలు నాలుగు చోట్ల సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారు. ఇందంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విచారణ చేపట్టిన పోలీసులు ఫుటేజీని విడుదల చేశారు.

వీడియో ఆధారంగా నీలిరంగు చొక్కా ధరించి, ముసుగు ధరించిన ఓ వ్యక్తి బాణాసంచా పేల్చి ఏటీఎంను పేల్చాడు. మేనేజర్ మెసేజ్ అందుకున్న పోలీసులు సమయానికి రావడంతో దొంగలు డబ్బులు దోచుకోలేకపోయారు. మరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మూడు ఏటీఎంలు, వన్ ఇండియా బ్యాంకుకు చెందిన ఒక ఏటీఎంను దోచుకెళ్లారు. తిరువణ్ణామలై సిటీలో మరియమ్మన్ టెంపుల్ సమీపంలోని 10వ వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం, తేనిమల వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం, కలసప్పక్కం వైపు వన్ఇండియా ఏటీఎం, పోలూరు బస్టాండ్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను ధ్వంసం చేశారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఏటీఎం మిషన్లు అమర్చిన గదుల్లోకి ప్రవేశించిన దుండగులు షట్టర్లు మూసివేసి గ్యాస్ కట్టర్ తో మిషన్ ను కట్ చేసి డబ్బులు దోచుకెళ్లారు. మొత్తం డెబ్బై ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.. నాలుగు చోట్లా దోపిడీ అనంతరం దొంగలు ఏటీఎం మిషన్లు, సీసీ కెమెరాలకు నిప్పు పెట్టారు. పక్కా ప్రణాళికతో ఒకే సారి నాలుగు చోట్ల దోపిడీలు చేశారు. ఏటీఎం మెషీన్లు, సీసీటీవీలకు నిప్పుపెట్టగా సీసీటీవీ ఫుటేజీ, వేలిముద్రలు కనిపించలేదు. ఫోరెన్సిక్ బృందం వచ్చి శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. తిరువణ్ణామలై సిటీ, పోలూరు, కలసప్పక్కం వంటి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దోపిడీ జరిగింది. దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..