AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తాగి డ్రైవింగ్ చేస్తే వెయ్యి సార్లు రాయండి.. డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు వింత శిక్ష..

డ్రైవర్లు ఇంపోజిషన్లు రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే న్యాయ వ్యవస్థలో కఠిన శిక్షలు ఉంటాయి.

Watch Video: తాగి డ్రైవింగ్ చేస్తే వెయ్యి సార్లు రాయండి.. డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు వింత శిక్ష..
Bus Drivers Punishment
Sanjay Kasula
|

Updated on: Feb 14, 2023 | 8:36 AM

Share

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన డ్రైవర్లకు త్రిపుణితుర పోలీసులు వెరైటీ శిక్షలు వేశారు. ఇకపై మద్యం తాగి వాహనాలు నడపమూ అంటూ వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయాలని ఆదేశించారు పోలీసులు. డ్రైవర్లు ఇంపోజిషన్లు రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే న్యాయ వ్యవస్థలో కఠిన శిక్షలు ఉంటాయి. లైసెన్సు స్వల్ప కాలానికి సస్పెండ్ చేయడంతోపాటు అరెస్టు తర్వాత బెయిల్ వస్తుంది. కానీ ఇంపోజిషన్ రాసిన శిక్ష వేడయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించిన వారిపై ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా విధింపు తప్పుగా వ్రాయబడిందని ఒక విభాగం అభిప్రాయపడింది.

అయితే చట్టపరమైన చర్యలు తీసుకున్నా.. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధింపు రాసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు త్రిపుణితుర హిల్ ప్యాలెస్ ఇన్ స్పెక్టర్ వి. గోపకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన 16 మంది డ్రైవర్లు 1000 సార్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఇంపోజిషన్ రాసి బెయిల్‌పై విడుదల చేశారు.

వీళ్లంతా రాస్తున్నది ఏ కాంపిటీటివ్‌ ఎగ్జామో కూడా కాదు. ఎందుకంటే నాలుగు పదులు పైబడిన… ఏజ్‌ బారైన వాళ్ళే వీళ్ళంతా… వివిధ భంగిమల్లో నేలపైన కూర్చుని వీళ్ళు నానా తిప్పలు పడి రాస్తున్నది ఏ ఎగ్జామినేషన్‌ సెంటర్లోనో కూడా కాదు…అది కేరళలోని ఓ పోలీస్‌ స్టేషన్‌… కానీ వీళ్ళు చేస్తున్నది ఇంపోజిషన్‌ రాయడం…రాస్తున్నది మాత్రం ఎవరో కాదు…రేయింబవళ్ళు మత్తు జగత్తులో జోగుతోన్న మందుబాబులే వీరంతా…

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా బుక్కయి…ఇలా బుక్కులు పట్టుకుని కూర్చున్నారు. ఎన్నిరకాలుగా చెప్పిచూసినా మారని కరుడుగట్టిన మందుబాబులతో ఇలా…ఇకపై నేను మందు తాగి డ్రైవింగ్‌ చేయను అంటూ వెయ్యిసార్లు ఇంపోజిషన్‌ రాయించారు కేరళ పోలీసులు.

ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. మందుబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించడంతో త్రిపునితుర పోలీసులు ఈ శిక్ష వేశారు. అంతమాత్రాన అసలు శిక్షనుంచి తప్పించుకోలేరని కూడా స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం