Photo Puzzle: ఈ ఫోటోలో ‘b’ అక్షరాన్ని కనిపెట్టగలరా? గింగిరాలు తిరిగి బొమ్మ కనిపిస్తది!
ఫోటో పజిల్స్ అనేవి కిక్కు మాత్రమే కాదు.. మన మెదడుకు కూసింత మేత కూడా వేస్తాయి. అందుకేనేమో ఏజ్ గ్యాప్ అనేది లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ ఫోటో పజిల్స్‌ను..
ఎవ్వరినైనా మీ ఫ్రీ టైంని ఎలా గడుపుతారని అడిగితే.. ఠక్కున ఏదైనా వెబ్ సిరీస్ లేదా ఫన్నీ వీడియోస్ అని కొందరు చెబుతారు. ఇంకొందరైతే ఇంటర్నెట్‌లో తరచూ తారసపడే ఏదైనా పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తుంటారు. ఆ పజిల్స్ అనేవి కిక్కు మాత్రమే కాదు.. మన మెదడుకు కూసింత మేత కూడా వేస్తాయి. అందుకేనేమో ఏజ్ గ్యాప్ అనేది లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ ఫోటో పజిల్స్‌ను తగ్గేదేలే.. అన్నట్లుగా సాల్వ్ చేసేస్తుంటారు. ఇక వీరి కోసం సోషల్ మీడియాలో ఎన్నో పేజిస్ ఇలాంటి పజిల్స్‌ను అందిస్తున్నాయి. మరి మీకూ ఫోటో పజిల్‌పై ఇష్టముంటే..? సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలనుకుంటే.? రండి ఈ పజిల్‌కు సంబంధించిన ఆన్సర్ కనిపెడదాం.
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? మీకేం కనిపిస్తోంది.. వెంటనే ‘d’ అక్షరాల సిరీస్ అని చెప్పొద్దు. కాస్త మీ కళ్లకు పని చెప్పండి.. క్షుణ్ణంగా ఫోటోను పరిశీలించండి.. అప్పుడే అందులో దాగున్న ‘b’ అక్షరం కనిపిస్తుంది. ఏమంటారు.! మీకు కనిపించిందా.? కచ్చితంగా ‘b’ వర్డ్‌ను కనిపెట్టాలంటే మీ బుర్ర గింగిరాలు తిరుగుద్ది.. మీకు బొమ్మ కనిపిస్తది.. ఇది అట్టాంటి.. ఇట్టాంటి పజిల్ కాదండోయ్.. ఫోటోను పైపైన చూస్తే దొరకదు. కాస్త బుర్రకు పదునుపెట్టాలి.. మీ ఐ పవర్‌ను షార్ప్ చేయాలి. కేవలం 15 సెకన్లలో ‘b’ని గుర్తిస్తే మీరే గ్రేట్.. ఒకవేళ ఎంత వెతికినా కనిపించకపోతే.. సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి..
here is the answer pic.twitter.com/iU7EXwKf0I
— telugufunworld (@telugufunworld) February 14, 2023