Hyderabad: నగరం నడిబొడ్డున తెగిపడ్డ విద్యుత్ హైటెన్షన్ వైరు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం..!
హైదరాబాద్ నగరం నడి రోడ్డుపై విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి పెద్ద ప్రమాదమే తప్పింది. మహానగరంలో సాయంత్రం వేళలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులకు విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారుడికి ప్రమాదం తప్పింది. కాస్త తేడా వచ్చినా వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడేది.

హైదరాబాద్ నగరం నడి రోడ్డుపై విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి పెద్ద ప్రమాదమే తప్పింది. మహానగరంలో సాయంత్రం వేళలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులకు విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారుడికి ప్రమాదం తప్పింది. కాస్త తేడా వచ్చినా వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడేది. వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలకు తీగలు వేలాడుతూ అలాగే వదిలేసి ఉండడం కూడా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది.
హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి రోడ్డుపై సోమవారం(ఏప్రిల్ 14) సాయంత్రం విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడింది. భారీ స్థాయిలో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగినపడినట్లు తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా జరగరాని నష్టం జరిగిపోయేదని స్థానికులు చెబుతున్నారు. ఉన్నట్లుండి విద్యుత్ తీగలు తెగిపడడంతో అప్రమత్తమైన వాహనదారులు జాగ్రత్తపడ్డారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తద్వారా వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే వీచిన గాలులకు చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి రోడ్డుపై విద్యుత్ హైటెన్షన్ వైరు తెగిపడి చాలా సేపు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్పందించిన ట్రాఫిక్ అధికారులు, విద్యుత్ సిబ్బంది సాయంతో తెగిపడిన విద్యుత్ హైటెన్షన్ వైరును పునరుద్ధరించి, రాకపోకలను కొనసాగించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..