అడవులపైకి బుల్డోజర్లా.. వన్యప్రాణులను చంపేస్తారా.. కంచె గచ్చిబౌలి భూములపై స్పందించిన ప్రధాని మోదీ
చోటే భాయ్ ఆప్ నే క్యా కియా? పచ్చని అడవిపైకి బుల్డోజర్లను పంపిస్తారా? ప్రకృతిని విధ్వంసం చేస్తారా? వన్యప్రాణులను ప్రమాదంలో పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు బడే భాయ్ మోదీ. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అడవులను కూడా అంతం చేస్తోందని మండిపడ్డారు.

గత నెలరోజులుగా తెలంగాణ రాజకీయాలను కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం కుదిపేస్తోంది. విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టారు. కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. తక్షణమే వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇవే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పచ్చని అడవిని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం అటవీ సంపదను నాశనం చేస్తుందని మండిపడ్డారు నరేంద్ర మోదీ.
కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు మోదీ. ఆ హామీలను గాలికొదిలేయడమే కాకుండా ప్రకృతిని ధ్వసం చేస్తూ స్వచ్ఛమైన గాలి లేకుండా చేస్తుందని విమర్శించారు ప్రధాని. మోదీ వ్యాఖ్యలపై స్పందించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాము అడవిని ధ్వంసం చేయడంలేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..