US New Rule: హలో అవుటర్స్ . సర్దుకుపోతారా.. జరిమానాలతో జైలుకు వెళ్తారా..?
మీ సామాను తీసుకొని విమానం ఎక్కండి. ఎలాంటి క్రిమినల్ బ్యాగ్రౌండ్ లేకపోతే.. అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా తీసుకుని దర్జాగా బయల్దేరండి.. నో ప్రాబ్లమ్..! కానీ గడువు మీరితే మాత్రం గండం తప్పదంటోంది అమెరికా. ఇప్పటికే వందలమంది వీసాల రద్దు చేసిన ట్రంప్ సర్కార్.. సరికొత్త ఆంక్షల కత్తి పట్టుకుని మరోసారి వేట మొదలు పెట్టింది.

మీ సామాను తీసుకొని విమానం ఎక్కండి. ఎలాంటి క్రిమినల్ బ్యాగ్రౌండ్ లేకపోతే.. అమెరికాలో సంపాదించుకున్న సొమ్మంతా తీసుకుని దర్జాగా బయల్దేరండి.. నో ప్రాబ్లమ్..! కానీ గడువు మీరితే మాత్రం గండం తప్పదంటోంది అమెరికా. ఇప్పటికే వందలమంది వీసాల రద్దు చేసిన ట్రంప్ సర్కార్.. సరికొత్త ఆంక్షల కత్తి పట్టుకుని మరోసారి వేట మొదలు పెట్టింది. అక్రమంగా ఉంటున్నారా..అయితే 30రోజుల్లో వెళ్లిపోండి..లేకుంటేనా..అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. అమెరికాలో ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపిచేస్తామని హెచ్చరించింది అమెరికా. అంతేకాదు.. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే వెయ్యి రూపాయల నుంచి 5వేల డాలర్ల ఫైన్ విధిస్తారు. భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించే అవకాశం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చింది అమెరికా. అమెరికా నిబంధనలు నేరుగా హెచ్1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా పాటించాలి. ఎవరైనా...