Pig Kidney: మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం ఏంటంటే..?
అలబామాలోని మహిళకు మూడు నెలల క్రితం పంది మూత్రపిండాన్ని అమర్చారు. అయితే, 130 రోజుల తర్వాత ఆమె శరీరం దానిని తిరస్కరించడంతో తొలగించాల్సి వచ్చింది. ఇది జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ పరిశోధనలో ఒక వెనుదిరిగిన అడుగు. అయితే, మానవ అవయవాల కొరతను తీర్చడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి. పరిశోధకులు తక్కువ అనారోగ్యంతో ఉన్న రోగులపై ఈ మార్పిడిని ప్రయత్నిస్తున్నారు.

ఓ మహిళ శరీరం నుంచి పంది కిడ్నీని డాక్టర్లు తొలగించారు. ఓ మూడు నెలల క్రితం ఆమెకు పంది కిడ్నీని అమర్చారు. అయితే.. ఆపరేషన్ జరిగిన 130 రోజుల తర్వాత పంది కిడ్నీని మహిళ శరీరం నుంచి తొలగించాల్సి వచ్చింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. అలబామాలోని ఒక మహిళ పంది కిడ్నీతో రికార్డు స్థాయిలో 130 రోజులు జీవించారు. అయితే ఆమె శరీరం దానిని తిరస్కరించడం ప్రారంభించిన తర్వాత ఆ అవయవాన్ని తొలగించారు. ఆమె ఇప్పుడు మళ్లీ డయాలసిస్‌పై ఆధారపడాల్సివస్తోందని వైద్యులు ప్రకటించారు. అయితే పంది కిడ్నీతో మనుషులకు వచ్చే కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టాలని వైద్య శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు ఇది విషయం నిరాశ కలిగిస్తోంది.
కాగా, ఏప్రిల్ 4న లాంగోన్ హెల్త్‌లో జరిగిన తొలగింపు శస్త్రచికిత్స తర్వాత టోవానా లూనీ బాగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. మానవ అవయవాల కొరతను తీర్చడానికి శాస్త్రవేత్తలు పందుల అవయవాల్లో జన్యుపరంగా మార్పులు చేసి మనిషి శరీరంలో అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా 100,000 కంటే ఎక్కువ మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా లక్షల్లో బాధితులు పెరిగిపోతుండటం, వారికి అవసరమైన మానవ అవయవాలు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ప్రత్యామ్నాయం కోసం పంది అవయవాలపై ప్రయోగాలు చేసి మనుషులకు అమర్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కొంత వరకు సక్సెస్ అవుతున్నా.. ఇంకా మంచి ఫలితాలు రావాల్సి ఉంది. లూనీ కంటే ముందు కేవలం నలుగురు అమెరికన్లకు మాత్రమే జన్యు మార్పులు చేసిన పంది అవయవాలను అమర్చారు. అలా అమర్చిన రెండు హృదయాలు, రెండు మూత్రపిండాలు రెండు నెలల కంటే ఎక్కువ కాలం పనిచేయలేదు. శస్త్రచికిత్సకు ముందు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ గ్రహీతలు మరణించారు. ఇప్పుడు పరిశోధకులు లూనీ లాంటి కొంచెం తక్కువ అనారోగ్యం ఉన్న రోగులలో ఈ మార్పిడిని ప్రయత్నిస్తున్నారు. జనవరిలో పంది మూత్రపిండాన్ని పొందిన న్యూ హాంప్‌షైర్ వ్యక్తి బాగానే ఉన్నారు. చైనా పరిశోధకులు ఇటీవల విజయవంతమైన లివర్ జెనోట్రాన్స్‌ప్లాంట్‌ను కూడా ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.