Mehul Choksi Arrest: బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్.. భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు..!
బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పరారైన కేసులో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు. సీబీఐ వినతి మేరకు అతడిని అరెస్ట్ చేశారు బెల్జియం పోలీసులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే.. మెహుల్ చోక్సీ, నీరవ్‌మోదీలు దేశం విడిచి పారిపోయారు. ఆంటిగ్వా-బార్బుడాకు చోక్సీ పారిపోగా.. నీరవ్ మోదీ బ్రిటన్ జైలులో ఉన్నాడు.

బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పరారైన కేసులో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు. సీబీఐ వినతి మేరకు అతడిని అరెస్ట్ చేశారు బెల్జియం పోలీసులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ముంచిన స్కామ్ 2018లో వెలుగులోకి రాగానే.. మెహుల్ చోక్సీ, నీరవ్‌మోదీలు దేశం విడిచి పారిపోయారు. ఆంటిగ్వా-బార్బుడాకు చోక్సీ పారిపోగా.. నీరవ్ మోదీ బ్రిటన్ జైలులో ఉన్నాడు. వీరిని వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీన్నుంచి తప్పించుకునేందుకు చోక్సీ ఆంటిగ్వా-బార్బుడా నుంచి బెల్జియం పారిపోయాడు. అయితే చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని ఇటీవలే ప్రకటించింది బెల్జియం ప్రభుత్వం. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బెల్జియంలో పోలీసుల అదుపులో ఉన్న చోక్సీని భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు 13 వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చోక్సీతో పాటు కేసులో మరో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా.. నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గతనెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది.
ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి చోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ పొందాడు. ఈ కేసులో మరో నిందితుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. ముంబై దాడుల కుట్రదారు తహవ్వుర్ రాణాను ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు రప్పించింది మోదీ ప్రభుత్వం. ఇప్పుడు మరో మోస్ట్ వాంటెండ్ చోక్సీ అరెస్ట్ అవడం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..