USA: అమ్మో అమెరికా..! సర్దుకుపోతారా…? సర్దేసి పంపించమంటారా..?
హలో అవుటర్స్ . సర్దుకుపోతారా...జరిమానాలతో జైలుకు వెళ్తారా..? అంటూ హెచ్చరిస్తోంది అమెరికా. ఇప్పటికే వందలమంది వీసాల రద్దు చేసిన ట్రంప్ సర్కార్.....మరోసారి ఆంక్షల కొరడా ఝులిపిస్తోంది. 30రోజుల్లో వెళ్లిపోండి..లేకుంటేనా..అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. కాగా అమెరికాలో మనదేశం నుంచి సుమారు 3-4 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అంచనా..

అమెరికాలో ఎక్కువకాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపిచేస్తామని హెచ్చరించింది అమెరికా. అంతేకాదు.. ఫైనల్ ఆర్డర్ అందుకొన్న వారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే వెయ్యి రూపాయల నుంచి 5వేల డాలర్ల ఫైన్ విధిస్తారు. భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించే అవకాశం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చింది అమెరికా.
అమెరికా నిబంధనలు నేరుగా హెచ్1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా పాటించాలి. ఎవరైనా హెచ్1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే.. వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, హెచ్1బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
అక్రమ ఇమిగ్రెంట్లను గుర్తించడానికి వారిని బలవంతంగా లేకపోతే స్వచ్ఛందంగా దేశం వీడేలా చేయడానికి INAలోని నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది అమెరికా. ఇందులో రిజిస్ట్రేషన్, ఫింగర్‌ప్రింటింగ్, చిరునామా మార్పులను తప్పనిసరి చేసింది. 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విదేశీయులు, అమెరికాలో 30 రోజులకు మించి ఉంటే, U.S సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే..మైనర్ నేరం కింద 5వేల డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. లేకపోతే 30 రోజుల జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉంది. F-1, J-1 వంటి స్టూడెంట్ వీసాలపై ఉన్న విద్యార్థులు తమ వీసా నిబంధనలను కఠినంగా పాటించాల్సి ఉంటుంది. చిన్న ఉల్లంఘనలు అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్లో లోపాలు ఉన్నా వీసా రద్దు చేసే అవకాశం ఉంది.
అమెరికాలో సుమారు 10-12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు, వీరిలో మనదేశం నుంచి సుమారు 3-4 లక్షల మంది ఉన్నారు. వీళ్లందరిపై కొత్త రూల్స్ తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.