భారత ఫార్మా కంపెనీ గోడౌన్‌పై రష్యా మిస్సైల్ దాడి!
శనివారం కీవ్‌లోని భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ హెల్త్‌కేర్ గోడౌన్‌పై రష్యా క్షిపణి దాడి జరిగింది. ఉక్రెయిన్ రాయబార కార్యాలయం రష్యాపై ఆరోపణలు చేసింది. కుసుమ్ హెల్త్‌కేర్ మానవతా సహాయానికి అవసరమైన ఔషధాలను నిల్వ చేసిందని తెలిపింది. భారత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లోని కైవ్‌లోని ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గోడౌన్‌ని రష్యా క్షిపణి ఢీకొట్టిందని భారతదేశంలోని ఉక్రెయిన్ దేశ రాయబార కార్యాలయం ఆరోపించింది. భారతదేశంతో ‘ప్రత్యేక స్నేహం’ ఉందని చెబుతూనే రష్యా ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది.
ధ్వంసమైన గిడ్డంగి ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటైన కుసుమ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినది. నివేదికల ప్రకారం, కుసుమ్ హెల్త్‌కేర్ మానవతా ప్రయోజనాల కోసం ఉపయోగించే అవసరమైన వైద్య సామాగ్రిని నిల్వ చేసింది. ఈ కంపెనీ భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలో ఉంది.
“ఈరోజు, ఉక్రెయిన్‌లోని భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ గిడ్డంగిని రష్యా క్షిపణి ఢీకొట్టింది. భారతదేశంతో ‘ప్రత్యేక స్నేహం’ అని చెప్పుకుంటూనే, మాస్కో ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంది. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులను నాశనం చేస్తోంది” అని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఎక్ష్‌లో తెలిపింది. మరి దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.