AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desert plant: ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. అందంతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఈ మొక్క సొంతం..

ప్రకృతికి మనుషులకు విడదీయరాని బంధం ఉంది. సమస్త మానవాళికి మొక్కలు అనేక రకాలుగా మేలు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కూడా చేస్తాయి. మొక్కలు ఆహారాన్ని అందిస్తాయి. మెడిసిన్స్ గా కూడా ఉపయోగపడతాయి. ఇంట్లో, ఆవరణలో మాత్రమే కాదు.. వీధిలో కూడా రకరకాల మొక్కలను పెంచుతున్నారు. తాజాగా ఎడారి దేశంలో పెరుగుతున్న ఒక మొక్క ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మొక్క ఆ ఎడారి నెలలో బంగారం పండిస్తుంది. అయితే ఈ మొక్క మూలాలు యూరప్, ఆఫ్రికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆ మొక్క గురించి తెలుసుకుందాం..

Desert plant: ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. అందంతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఈ మొక్క సొంతం..
Reseda Alba
Surya Kala
|

Updated on: Apr 14, 2025 | 1:55 PM

Share

సౌదీ అరేబియా అంతటా కనిపించే సుగంధ ద్రవ్యాల మూలిక అయిన రెసెడా ఆల్బా, ఎడారీకరణను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సుగంధ మూలిక ఉత్తర సరిహద్దులలోని స్థానిక వృక్షసంపదలో కీలకమైన భాగం. తెల్ల మిగ్నోనెట్ లేదా తెల్లని నిటారుగా ఉండే మిగ్నోనెట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చిన్న, తెల్లని, సువాసనగల పువ్వులను కలిగి ఉంటుంది. ఈ మొక్కను అలంకార మొక్కగా కూడా పండిస్తారు. ఇది వసంతకాలంలో వికసిస్తుంది. తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. పర్యావరణ సమతుల్యతను పెంచుతుంది. జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. ఈ మొక్క అందానికి మాత్రమే కాదు అనేక ఔషధ గుణాలతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి.

ఇసుక, బంకమట్టి నేలలు రెండింటిలోనూ పెరిగే ఈ మొక్క ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని ఎడారి వాతావరణానికి బాగా సరిపోతుంది. నేలను స్థిరీకరించడం ద్వారా ఎడారీకరణను ఎదుర్కోవడంలో కూడా ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది.

సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క యూరప్, ఆసియా, ఉత్తర ఆఫ్రికాకు కూడా చెందింది. దీనిని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పరిచయం చేయబడిన జాతిగా చూడవచ్చని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు. రెసెడా ఆల్బా ఎడారిలో నీటి ఎద్దడిని తట్టుకుని పెరుగుతుందని.. ఈ మొక్క పెరుగుదల సౌదీ అరేబియాలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమన్ ఎన్విరాన్‌మెంటల్ అసోసియేషన్ చైర్మన్ నాసర్ అల్-ముజ్లాద్ అన్నారు. ఈ మొక్క అందం, ఆకర్షణ ఈ ప్రాంతం పర్యాటక, పర్యావరణ ప్రాముఖ్యతకు గణనీయమైన విలువను జోడించిందని ఆయన చెప్పారు. గతంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న ఈ మొక్కలు తిరిగి జీవం పోసుకున్నాయని.. ఇక నైనా వీటిని రక్షిచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మొక్కను పెంచడం వలన ఎన్ని ప్రయోజనాలు అంటే

  1. రెసెడా ఆల్బాలో అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిని సాంప్రదాయక చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా దీనిని శ్వాసకోశ, జీర్ణ, చర్మ సమస్యల నుంచి ఉపసమనం కోసం ఉపయోగిస్తున్నారు.
  2. ఈ మొక్క ఆకుతో తీసియ రసాన్ని వస్త్రాలకు రంగులకు అద్దేందుకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పసుపు, పచ్చ రంగులను వేసేందుకు ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తున్నారు.
  3. ఈ మొక్కలోని ఔషధ గుణాలు వాపు-నిరోధక, క్రిమినాశక, ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంది.
  4. రెసెడా ఆల్బా పువ్వుల నుంచి వచ్చే తీపి వాసన కారణంగా వీటిని పెర్ఫ్యూమ్, పోట్‌పురి తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు.
  5. ఈ మొక్క భూమి కోతని నివారించడానికి ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.
  6. సౌదీ ఎడారిలో కనువిందు చేస్తున్న ఈ మొక్కను మన దేశంలో కూడా పెంచేందుకు ప్రయత్నలు మొదలు పెడుతున్నారు. మన దేశంలో ఈ మొక్కను పెంచేందుకు రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి