AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..! ఏం తినాలో ఏం తినొద్దో ఇప్పుడే తెలుసుకోండి..!

పెళ్లి తర్వాత మహిళల జీవితం మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతుంది. ముఖ్యంగా బరువు పెరగడం సాధారణం. కానీ కొన్ని సాధారణ అలవాట్లతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ డైట్‌ లో ఇవి ఉంటే పెళ్లి తర్వాత బరువు పెరగరు..! ఏం తినాలో ఏం తినొద్దో ఇప్పుడే తెలుసుకోండి..!
Women Weight Control Tips
Prashanthi V
|

Updated on: Apr 14, 2025 | 4:35 PM

Share

పెళ్లి అనంతరం మహిళల జీవన విధానం ఒక్కసారిగా మారిపోతుంది. కొత్త బాధ్యతలు, కొత్త వాతావరణం, కొత్త సంబంధాలు అన్నీ కలిపి ఆమె జీవితంలో బహుళ మార్పులు తీసుకువస్తాయి. ఈ మార్పుల ప్రభావం ఆహారపు అలవాట్లపై కూడా పడుతుంది. అనేక సందర్భాల్లో పెళ్లి తర్వాత మహిళలు బరువు పెరగడం సహజంగా జరుగుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ బరువు పెరుగుదలపై నియంత్రణ సాధించవచ్చు. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లయ్యాక ఎక్కువ మంది మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి తరచూ వివిధ ఆహార కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల ఇంట్లో విందులు, పార్టీల్లో భోజనాలు ఇలా తరచూ జరుగుతుంటాయి. ఈ సందర్భాల్లో ఇది నాకు చాలా ఇష్టం, ఇది తినడం తప్పేలా లేదు అనే భావనతో అన్నీ ఎక్కువగా తినకండి. లిమిటెడ్ గా తినడం వల్ల రుచిని అనుభవించగలుగుతారు. అదే సమయంలో బరువు పెరిగే ప్రమాదం కూడా ఉండదు.

భోజనం మొత్తాన్ని తగ్గించుకోవాలంటే మొదట తేలికపాటి ఆహారాన్ని తీసుకునే అలవాటు పెంచుకోవాలి. ఉదాహరణకు తాజా కూరగాయలతో తయారైన సలాడ్లు, వెజిటబుల్ సూప్ లేదా పండ్ల చాట్ వంటివి ముందుగా తినడం మంచిది. ఇవి కడుపుని కొంతవరకూ నింపేసి తర్వాత ఎక్కువగా అన్నం తినకుండా నియంత్రించగలవు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లక బరువు పెరగడానికి కారణమవుతుంది. రోజంతా కనీసం 8–10 గ్లాసుల నీరు తాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

పెళ్లైన కొత్తలో మిఠాయిల విందులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ స్వీట్స్‌తో ఆదరిస్తారు. అయితే వీటిని పరిమిత మోతాదులోనే తినాలి. తరచుగా మిఠాయిలను తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి కేలరీలు అధికంగా చేరతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

నిత్యం కనీసం 30 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఈ సమయాన్ని జీవిత భాగస్వామితో గడిపితే మరింత మంచిది. ఒకవైపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మరోవైపు రిలేషన్‌షిప్ బలపడుతుంది. వాకింగ్ వల్ల శరీరం చురుకుగా ఉంటుంది, క్యాలరీలు ఖర్చవుతాయి.

వాకింగ్‌కు తోడు కాస్త శారీరక వ్యాయామం చేస్తే శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. యోగా, బ్రిస్ట్ వర్కౌట్స్, స్ట్రెచింగ్ వ్యాయామాలు శరీరాన్ని సజీవంగా ఉంచుతాయి. రోజూ కనీసం 20 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ కోసం కేటాయించండి.

రోజూ తీసుకునే భోజనంలో పచ్చికూరగాయలు, మిలెట్లు, చిక్కుడు గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చాలి. ఇవి జీర్ణం బాగా అవుతాయి, అలసట రాకుండా చేస్తాయి. హెల్తీ ఫ్యాట్స్ ఉన్న పదార్థాలు కూడా శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి.

మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ జ్యూసులు, ఎనర్జీ డ్రింక్స్‌లో అధికంగా చక్కెర, కలరింగ్ ఏజెంట్లు ఉండటం వల్ల అవి బరువు పెరగడానికి దోహదపడతాయి. వీటి బదులు ఇంట్లోనే తాజా పండ్ల రసాలు తాగడం మంచిది. ఇది సహజంగా శక్తిని ఇస్తుంది. ఈ చిట్కాలతో మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే పెళ్లి తర్వాత బరువు పెరగకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.