AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warm Water Benefits: వేసవిలో వేడి నీరు తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

వేసవి కాలం వస్తే చాలు ఎండ వేడికి దాహం ఎక్కువ వేస్తుంది. దీంతో తరచుగా చల్లటి నీరు తాగాలని కోరుకుంటారు. కొంతమంది ప్రిడ్జ్ లో నీరు పెట్టుకుని మంచి నీరు తాగితే.. మరొకొందరు కుండలో నీటిని తాగుతారు. అయితే కొంత మంది ఎంత ఎండలో నైనా సరే వేడి నీరుని తాగుతారు. అయితే వేసవిలో వేడి నీళ్లు తాగాలా వద్దా అనే ప్రశ్న తలెత్తుతుంది? అలాగే వేసవిలో వేడి నీరు తాగడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం తెలుసుకుందాం?

Warm Water Benefits: వేసవిలో వేడి నీరు తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
అదే చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. బరువు నియంత్రణ, మధుమేహం,కఫం వంటి ఆరోగ్య సమస్యలకు గోరువెచ్చని నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Follow us
Surya Kala

|

Updated on: Apr 14, 2025 | 10:27 AM

సీజన్ ఏదైనా సరే దాహార్తిని తీర్చుకోవడానికి చల్లటి నీరు తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది. అయితే అధికంగా చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయదు. ఇదే విషయంపై అనేక పరిశోధనలు చేశారు. ఇందులో గోరువెచ్చని నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించింది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో వేడి నీరు సహాయపడుతుంది. అయితే వేసవిలో గోరువెచ్చని నీరు తాగవచ్చా? లేదో తెలుసుకుందాం..

ఆరుబయట తిరిగి మండే ఎండ నుంచి ఇంటిలోపలికి వచ్చినప్పుడు వెంటనే చల్లటి నీరు తాగకూడదని.. బదులుగా సాధారణ నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. సాధారణ నీరు శరీరంపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపదని పరిశోధకులు చెప్పారు.

శరీరాన్ని డీటాక్స్ చేయడానికి: వేడి నీరు మీ శరీరం నుంచి మురికిని సహజంగా తొలగించడంలో సహాయపడుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల సిరలు కుంచించుకుపోతాయి. ఇది రక్త ప్రసరణను నెమ్మదించేలా చేస్తుంది. వేడి నీటిని తాగడం వలన రక్త నాళాలను విస్తరించడానికి పనిచేస్తుంది. అంతేకాదు వేడి నీరు మూత్రపిండాలు, కాలేయం పనితీరు కూడా మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

పేగు ఆరోగ్యాన్ని ఆరోగ్యం: కడుపు ఉబ్బరం లేదా తిమ్మిరి, జీర్ణ సమస్యల విషయంలో కూడా వేడి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చల్లటి నీరు తాగడం వల్ల కడుపు లేదా శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. వేడి నీరు కడుపు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఎంజైమ్‌లను కూడా నెమ్మదిస్తుంది.

గోరువెచ్చని నీరు త్రాగేసమయంలో సమయం గురించి జాగ్రత్తగా ఉండండి: మీకు గోరువెచ్చని నీరు త్రాగే అలవాటు ఉంటే.. తాగే సమయం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోండి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా తిన్న అరగంట తర్వాత త్రాగాలి. ఇలా చేయడం వలన తక్షణ ప్రయోజనం అందుతుంది. NCBI చేసిన పరిశోధన ప్రకారం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల పేగు పనితీరు మెరుగుపడుతుంది.

మెరుగైన జీవక్రియ: వేడి నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఒత్తిడి నుంచి ఉపశమనం: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే.. ఒత్తిడి, ఆందోళన నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల వాపు తగ్గుతుంది. కండరాలు సడలించబడతాయి .రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. తలనొప్పి, మైగ్రేన్‌లను తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)