Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: తుది దశలో రామాలయ నిర్మాణం.. ఏప్రిల్ 30 నుంచి రామ దర్బార్ సహా 18 విగ్రహాల ప్రతిష్ట

కోట్లాది హిందువుల కల తీరుతూ రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయంలో గర్భ గుడిలో బాల రామయ్య కొలువుదీరాడు. భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. మరోవైపు రామాలయం నిర్మాణం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రామాలయ నిర్మాణ కమిటీ మూడు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ ఏడాదిలోనే భక్తులకు పూర్తి స్థాయిలో రామాలయం దర్శనం ఇస్తుంది. రామాలయం ప్రాంగణంలో ఏప్రిల్-మే నెలల్లో శ్రీ రాముడు సహా అనేక దేవుళ్ల విగ్రహాలను ప్రతిశించనున్నారు. ఆలయ శిఖరం మే 15 నాటికి పూర్తవుతుంది.

Ayodhya: తుది దశలో రామాలయ నిర్మాణం.. ఏప్రిల్ 30 నుంచి రామ దర్బార్ సహా 18 విగ్రహాల ప్రతిష్ట
Ayodhya Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Apr 14, 2025 | 7:30 AM

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మిస్తున్న రామాలయానికి సంబంధించి నిర్మాణ కమిటీ మూడు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఏప్రిల్, మే నెలల్లో శ్రీరాముడు, సాధువులు, ఇతర దేవుళ్లు, దేవతల విగ్రహాలను ప్రతిష్టిస్తామని కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఏడు దేవాలయాలలోని ఏడు విగ్రహాలు త్వరలో ఆలయ ప్రాంగణానికి చేరుకుంటాయి. రామమందిర శిఖరం పనులు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. మే 15 నాటికి పూర్తికానున్నాయి.

గర్భగుడి పైన ఉన్న మొదటి అంతస్తులో ప్రతిష్టించాల్సిన శిలను వాసుదేవ్ కామత్ తయారు చేశారు. ఒక నిర్దిష్ట శిల మీద ఒక పెయింటింగ్ ఉంది. అందులో రాముడు రామేశ్వరంలో శివుడిని పూజిస్తున్నట్లు చూపబడింది. ఈ శిల ఉత్తర, దక్షిణ భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కామత్ ఆ రాయిని పరీక్షించి, దానికి తన అనుమతి కూడా ఇచ్చాడు. ఆలయ ప్రాంగణంలో లైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

భక్తుల సౌకర్యం కోసం పందిరి నిర్మాణం

భక్తుల ధ్యానానికి, భక్తికి ఎటువంటి ఆటంకం కలిగించని విధంగా లైటింగ్ ఉంటుందని నృపేంద్ర మిశ్రా అన్నారు. ఒకవైపు సాంకేతిక సౌలభ్యం, అందాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక అనుభవానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. దర్శన మార్గాలను సజావుగా.. అందంగా మార్చడానికి, ఎల్ అండ్ టీ, స్టేట్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ సంయుక్తంగా రెండు భాగాలుగా పందిరిని నిర్మిస్తున్నాయి. దీనిలో ఒక భాగం పందిరి నిర్మాణాన్ని L&T పూర్తి చేసింది, మరొక భాగం రాష్ట్ర నిర్మాణ సంస్థది బాధ్యత.

ఇవి కూడా చదవండి

ఆధ్యాత్మిక వారసత్వానికి కొత్త దిశానిర్దేశం

భక్తుల సౌకర్యానికి, వర్షం , ఎండ నుంచి రక్షణకు ఈ పని చాలా ముఖ్యమైనది. రామాలయ నిర్మాణం ఒక గొప్ప నిర్మాణం మాత్రమే కాదు. భారతదేశ సాంస్కృతిక, మతపరమైన, ఆధ్యాత్మిక వారసత్వానికి కొత్త దిశానిర్దేశం చేస్తోంది. ప్రతి ఇటుక, ప్రతి రాయి దేశ భక్తి, విశ్వాసం స్పర్శను కలిగి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..