AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న భార్య, సోదరుడు, గురువుని వెంటనే విడిచి పెట్టమంటున్న చాణక్య.. ఎందుకంటే

చాణక్య విష్ణుశర్మ పేరుతో రచించిన పంచతంత్ర, కౌటిల్యుని పేరుతో అర్థ శాస్త్రము, చాణక్యుని పేరుతో చాణక్య నీతి రచించారు. అయితే ఆచార్య చాణక్య చెప్పిన నీతి సూత్రాలను పాటిస్తే జీవితంలోని ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని పెద్దలు చెబుతారు. నేటికీ చాణక్య నీతి శాస్త్రం చదవం వలన మంచి రాజనీతిజ్ఞులుగా, మంచి తెలివైన వారుగా మారుతారు. చాణక్య నీతిలో మనిషిలోని కొన్ని లోపాలను ప్రస్తావించాడు. భార్య, సోదరుడు లేదా గురువుకు ఇటువంటి లోపాలు ఉంటే మీరు ఈరోజే వాటికి దూరంగా ఉండాలి.

Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న భార్య, సోదరుడు, గురువుని వెంటనే విడిచి పెట్టమంటున్న చాణక్య.. ఎందుకంటే
Chanakya Niti
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 6:35 PM

Share

ఆచార్య చాణక్యుడు అత్యంత జ్ఞానవంతుడు, పండితుడు. ఆయన తన జీవితకాలంలో అనేక రకాల రచనలను చేశాడు. ఈ విధానాలను తరువాత చాణక్య నీతి అని పిలిచేవారు. ఎవరైనా విజయవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటే.. వారు చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను ఖచ్చితంగా పాటించాలని చెబుతారు. ఈ రోజు మీ భార్య, సోదరుడు, గురువులో ఉన్న కొన్ని లోపాల గురించి తెలుసుకుందాం.. ఇవి ఉంటే కనుక మీరు ఆలస్యం చేయకుండా, సంకోచించకుండా వారి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులను దూరం చేసుకున్నప్పుడే మీరు మెరుగైన జీవితాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. కనుక ఆ లోపాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ఇలాంటి భార్య నుంచి మీరు దూరంగా ఉండాలి.

చాణక్య నీతి ప్రకారం మీ భార్య ప్రతి విషయం లోనూ కోపాన్ని వ్యక్తం చేస్తుంటే.. లేదా ఆమె స్వభావం చాలా క్రోధంగా ఉంటే.. వెంటనే ఆమెను వదిలివేయాలి. కోపంగా ఉన్న స్త్రీలు తమ కుటుంబాన్ని ఎప్పుడూ క్రమంలో ఉంచుకోలేరు. అధికంగా కోపం ఉండే స్త్రీల కారణంగా.. కుటుంబంలో ఎల్లప్పుడూ అసమ్మతి వాతావరణం ఉంటుంది.

ఇలాంటి తోబుట్టువుల నుంచి దూరంగా ఉండటం మంచిది.

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీ తోబుట్టువులకు మీ పట్ల ప్రేమ, అనురాగ భావాలు లేకపోతే.. మీరు వారిని వదిలివేయాలి. అలాంటి తోబుట్టువులకు మీ జీవితంలో అస్సలు స్థానం ఇవ్వొద్దు అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి గురువు దగ్గర విద్య తీసుకోవడం వ్యర్థం.

చాణక్య నీతి ప్రకారం విద్య లేదా జ్ఞానం లేని గురువును మీరు వీలైనంత త్వరగా వదిలివేయాలి. అటువంటి గురువుకి గుర్తింపు ఏమిటంటే వారు తమ మాటలతో మిమ్మల్ని ఆకర్షించగలరు.. మీకు ఇవ్వడానికి వారి వద్ద ఎటువంటి జ్ఞానం ఉండదు. ఈ రకమైన గురువులు మీ భవిష్యత్తును పాడు చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?