AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baglamukhi: ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే రాజకీయాల్లో విజయం లభిస్తుందట.. తాంత్రిక విద్యలకు కేంద్రం..

బగ్లాముఖి ఆలయం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బంఖండిలో ఉంది. బాగ్లాముఖి హిందూ మతంలో దశమహావిద్యలలో ఒకరైన శక్తివంతమైన దేవత. అమ్మవారికి పసుపు అంటే ఇష్టం. కనుక ఇక్కడ అమ్మవారిని పీతాంబరీ అని కూడా పిలుస్తారు. అమ్మవారు బంగారు సింహసనంపై కూర్చుని ఉంటుంది. సింహాసనం వివిధ రత్నాలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారు మూడు కళ్ళు ఉన్నాయి. ఇవి ఆమె భక్తుడికి జ్ఞానాన్ని ఇవ్వగలదని సూచిస్తాయి.

Baglamukhi: ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే రాజకీయాల్లో విజయం లభిస్తుందట.. తాంత్రిక విద్యలకు కేంద్రం..
Baglamukhi Temple Kangra
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 6:10 PM

Share

ఈ రోజు మనం భక్తితో పాటు తంత్ర శక్తికి కేంద్రంగా పరిగణించబడే ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఉంది. ఇక్కడ అమ్మవారిని బగ్లాముఖి అని అంటారు. ఈ ఆలయం దశమహావిద్యలలో ఎనిమిదవ రూపమైన బగ్లముఖి అమ్మవారికి అంకితం చేయబడింది. ఇక్కడ అమ్మావారిని పీతాంబరి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పాండవులతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. బగ్లాముఖి ఆలయం దాని నమ్మకాల కారణంగా చాలా ప్రత్యేకమైనది. హిమాచల్ లోని ఈ ఆలయాన్ని పాండవులు స్థాపించారని.. ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని.. పాండవుల మధ్యముడు గొప్ప విలుకాడు అర్జునుడు మొదట బగ్లముఖిని ఈ ప్రదేశంలో పూజించాడని నమ్ముతారు.

ఆలయానికి సంబంధించి అనేక రహస్యాలు

బగ్లాముఖి ఆలయాలతో అనేక రహస్యాలు ముడిపడి ఉన్నాయని నమ్మకం. ఇక్కడ వెలిసిన అమ్మవారు స్వయంగా వేలిసిందని నమ్మకం. ఇక్కడ దేవాలయాలు స్వయంగా కూడా స్వయం నిర్మితాలు. అందుకే ఇక్కడ ఉన్న విగ్రహాలు సజీవంగా కనిపిస్తాయి. ఈ ఆలయాల స్థాపనకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు అయితే వీటిని పాండవులు స్థాపించారని చెబుతారు. పాండవులు తమ వనవాస సమయంలో బగ్లాముఖి ఆలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణుడు ఆపద సమయంలో బగ్లాముఖిని పూజించమని పాండవులకు సూచించాడు. బగ్లాముఖి అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులపై విజయం లభిస్తుంది. బగ్లాముఖి అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడికి వచ్చే వారు కోర్టు వివాదాలలో కూడా గెలుస్తారు. అన్ని రకాల పోటీలలో కూడా విజయం సాధిస్తారు.

కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు

బగ్లాముఖి అమ్మవారు తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తుందని., వారికి శక్తిని, విజయాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే నాయకుల నుంచి నటుల వరకు అందరూ ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తారు. అంతేకాదు ఇక్కడ అమ్మవారి క్షేత్రం తంత్ర అభ్యాసకులకు పవిత్ర భూమి.

ఇవి కూడా చదవండి

ఈ ఆలయం పసుపు రంగులో ఉంటుంది.

బగ్లాముఖి ఆలయంలో పసుపు రంగు పూజా సామగ్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బగ్లాముఖికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఆలయానికి పసుపు రంగు వేస్తారు. ఆలయంలో పసుపు జెండాలు రెపరెపలాడుతు ఉంటాయి. భక్తులు కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. ప్రసాదంగా పసుపు రంగు ఆహారాన్ని మాత్రమే నైవేద్యం పెడతారు.

ఇక్కడ నిర్వహించే హవనము విఫలం కాదు.

ఇక్కడ నిర్వహించే హవనము ఎన్నటికీ విఫలం కాదని నమ్ముతారు. ఇక్కడ ఒక పెద్ద హవన కుండం ఉంది, అక్కడ హవనం ఏడాది పొడవునా కొనసాగుతుంది. ఈ ఆలయంలో ఒక పవిత్రమైన అగ్నిగుండం ఉంది, అక్కడ రాముడు తన వన వాస సమయంలో హవనాన్ని నిర్వహించాడని నమ్ముతారు. ఇది ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఎందుకంటే ఇలా హవనం చేసిన శ్రీ రాముడికి బగ్లాముఖి దేవి దైవిక ఆశీర్వాదాలను, శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని రాముడికి ప్రసాదించిందని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.