Sita Rama Kalyanam: నేడు పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం.. సీతారామ లక్ష్మణులకు కానుకగా స్వర్ణ కిరీటాలు
ఆంధ్రప్రదేశ్ లోని కోదండ రాముడు వెండి వెన్నెలలో సీతమ్మని ఈ రోజు పరిణయం చేసుకోనున్నాడు. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. సీతారాములకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు దుస్తులను సమర్పించనున్నారు. సిఎం కుటుంబ సమేతంగా వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రామయ్య కల్యాణం సందర్భంగా శీవారి తరపున టీటీడీ భారీ కానుకలను పంపింది.

ఆంధ్రప్రదేశ్ వాసులకు అయోధ్య అంటే కడప జిల్లలో ఉన్న ఒంటిమిట్ట. ఇక్కడ కొలువైన శ్రీ కోదండరామ స్వామిని జాంబవంతుడు నిర్మించాడని నమ్మకం. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణోత్సవం ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. టీటీడీకి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుండగా భక్తులు టీటీడీ కి పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. ఒంటిమిట్ట ఆలయంలో కొలువైన శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత పి.ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీ లకు పైగా బంగారంతో తయారు చేసిన 3 స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి, కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు.
సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా ఓంటిమిట్ట ఆధ్యాత్మిక శోభని సంతరించుకుంది. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించానున్నాడు. ఆరు బయట పండు వెన్నెలలో జరిగే సీతా రాముల కళ్యాణోత్సవానికి ఐదు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని అధ్యత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




