AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti: హనుమాన్ జయంతి రోజున రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి.. జాతక దోషాలు తొలగిపోతాయి..

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల ఆలయంతో పాటు హనుమంతుడి ఆలయాలు కూడా భక్తులతో నిండిపోతాయి. ఆంజనేయస్వామిని అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా, రామచరితమానస్ పారాయణం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం హనుమాన్ జయంతి రోజున ఒక వ్యక్తి తన రాశి ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు.

Hanuman Jayanti: హనుమాన్ జయంతి రోజున రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి.. జాతక దోషాలు తొలగిపోతాయి..
Hanuman Jayanti 2025
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 2:28 PM

Share

హనుమంతుడి జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12వ తేదీ అంటే శనివారం జరుపుకోనున్నారు. శనివారం హనుమంతుడిని పూజిచడం అత్యంత శుభప్రదం.. అంతేకాదు ఈ రోజు ప్రత్యేక యోగా ఏర్పడుతుంది. దీనితో పాటు, ఈ హనుమాన్ జయంతి నాడు అనేక ఇతర శుభకరమైన యాదృచ్చిక సంఘటనలు జరుగుతున్నాయి. 57 సంవత్సరాల తర్వాత పంచగ్రాహి యోగా ఏర్పడుతోంది. ఈసారి హస్తా నక్షత్రంలోని మీన రాశిలో పంచగ్రహ యోగం ఏర్పడుతోంది. 57 సంవత్సరాల తర్వాత హనుమాన్ జయంతి రోజున 5 గ్రహాలు మీన రాశిలో కలిసి ఉంటాయి. ఈ రోజున, బుధుడు, శుక్రుడు, శని, రాహువు, సూర్యుడు మీన రాశిలో ఉంటారు. చంద్రుడు, కేతువు కన్యారాశిలో ఉంటారు. ఇలాంటి యాదృచ్చికం 1968 లో జరిగింది.

దీనితో పాటు బుధాదిత్య, శక్రాదిత్య, లక్ష్మీనారాయణ, మాళవ్య రాజయోగాల అరుదైన కలయిక కూడా మీనరాశిలో రూపొందుతోంది. పంచాంగం ప్రకారం రవి, జయ, హస్త, చిత్ర నక్షత్రాలలో హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. కనక ఈ రోజున రాశుల ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వలన అదృష్టం కలుగుతుందని నమ్మకం.

వృషభ-తుల రాశి వారు చేయాల్సిన పరిహారాలు

వృషభ, తుల రాశి వారు హనుమంతుడి ఆలయానికి వెళ్లి సుందరకాండ పారాయణం చేసి.. కోతులకు కొన్ని స్వీట్లు తినిపించాలి. ఇలా చేయడం ద్వారా వీరి జాతకంలోని శుక్రుడు బలపడతాడు.

ఇవి కూడా చదవండి

మేషం- వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు

హనుమంతుడు , వృశ్చిక రాశిలో జన్మించిన వారు హనుమాన్ అష్టకాన్ని పారాయణం చేయాలి. వీరు హనుమాన్ ఆలయంలో పూజ చేసి బూందీ ప్రసాదం పంచాలి. ఇది వారి పాలక గ్రహం అంగారకుడిని బలోపేతం చేస్తుంది.

మిథున – కన్య రాశుల వారు చేయాల్సిన పరిహారాలు

ఈ రెండు రాశుల వారు హనుమాన్ జయంతి నాడు అరణ్య కాండ పారాయణం చేయాలి. బజరంగబలికి నెయ్యి దీపం, లవంగాలతో తమలపాకును సమర్పించాలి. ఇది వీరి జాతకంలో బుధ గ్రహాన్ని బలోపేతం చేస్తుంది.

కర్కాటక రాశి వారికి పరిహారాలు

కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కనుక ఈ రాశి వారు హనుమంతుడికి వెండి గదను సమర్పించాలి. పూజలో పెట్టిన వెండి గదను మెడలో ధరించాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ పరిహారాలను చేయడం వలన వీరి జాతకంలో చంద్రుడు బలపడతాడు.

సింహ రాశి వారికి పరిహారాలు

సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఆలయానికి వెళ్లి తీపి పదార్థాలను దానం చేయాలి. వారు అక్కడ కూర్చుని బాలకాండ పారాయణం చేయాలి. అలా చేయడం వల్ల వీరి గ్రహానికి అధిపతి అయిన సూర్యుడు కూడా సంతోషిస్తాడు.

ధనుస్సు- మీన రాశి వారు చేయాల్సిన పరిహారాలు

ధనుస్సు, మీన రాశులకు గురువు అధిపతి. ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో గురువు బలోపేతం అవ్వడానికి అయోధ్య కాండ పారాయణం చేయండి. హనుమంతునికి పసుపు పువ్వులు, పండ్లు, పసుపు రంగు స్వీట్లు సమర్పించండి.

మకర- కుంభ రాశి వారికి పరిహారాలు

మకర, కుంభ రాశుల వారు రామచరితమానస్ పారాయణం చేయాలి. బజరంగ్ బలి కి ఒక కుండలో నల్ల మినపప్పును వేసి దానిని దేవుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు