AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Gochar 2025: త్వరలో రాశి మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రాశి వారికి అన్నీ ఇబ్బందులే..

సూర్య దేవుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని సంచారములో ఈ మార్పు కారణంగా కొన్ని రాశులు సానుకూలంగా.. కొన్ని ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. కనుక సూర్యుడి సంచారం వలన ఏ రాశులపై ఎటువంటి ప్రభావం చూపిస్తోందో జ్యోతిష్కులు చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు సూర్యుడి సంచారంతో ఏ రాశులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది తెలుసుకుందాం..

Surya Gochar 2025: త్వరలో రాశి మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రాశి వారికి అన్నీ ఇబ్బందులే..
Sun Enters Aries April 14
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 3:17 PM

Share

నవ గ్రహాలకు రాజు సూర్యుడు ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుని రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలుగుతుంది. సూర్యుడు ప్రతిరోజు ఒక డిగ్రీ కదులుతాడు. ఈ విధంగా సూర్యుడు ఒక రాశిలో దాదాపు 30 రోజుల పాటు ఉంటాడు. ఈ క్రమం నిరంతరం కొనసాగుతుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. వివిధ రాశులపై సూర్యుని ప్రభావం సానుకూలంగా, ప్రతికూలంగా లేదా సాధారణంగా ఉంటుంది. ఏదైనా గ్రహం తన మిత్రుని రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా.. ఆ మిత్ర రాశి ఉన్న వ్యక్తికి మంచి ఫలితాలు వస్తాయి.. అయితే శత్రు రాశిలోకి ప్రవేశిస్తే అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా స్నేహితుడు కాని లేదా శత్రువు కాకపోతే ఫలితం ఉదాసీనంగా ఉంటుంది. అయితే ఈ రోజు సూర్యుని సంచారము వలన కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.

ఈ రెండు రాశుల వారికి తటస్థ ఫలితం

వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడు రెండు రాశులకు అధిపతి. మిథున రాశి, కన్య రాశిలకు. శాస్త్రాల ప్రకారం సూర్యునికి బుధ గ్రహంతో సంబంధాలు మంచివి కావు. వాయు మూలక రాశి అయిన మిథున రాశి, స్థిరమైన ప్రవాహాన్ని సూచిస్తుంది. దిశ మారుతూ ఉంటుంది. అస్థిరతను చూపుతుంది. అయితే సూర్యుని సంచారము మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి.

కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు కన్య రాశి వారిలాగే శాంతి ప్రియులు . ఆచరణాత్మకంగా ఉంటారు. వీరికి తార్కిక తెలివితేటలు ఉంటాయి, మోసగాళ్లను సులభంగా గుర్తించగలరు. అయితే అవసరం వచ్చినప్పుడు వారు చాలా చురుకుగా ఉంటారు. ఈ సంచారము కన్య రాశి వారికి ప్రతికూల ప్రభావాలను కొంతవరకు నియంత్రించడంలో కూడా విజయవంతమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఏ రాశుల వారు ప్రతికూల ప్రభావాలను చూపుతుందంటే

వృషభ, తుల, మకర, కుంభ రాశుల వారికి సూర్య సంచారం వలన శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. శుక్రుడు పాలించే గ్రహాలు వృషభం, తుల రాశులు. ప్రధానంగా వృషభ రాశి వారు ప్రకృతిలా గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. మనసు గాయపడినప్పుడల్లా కోపంగా, హింసాత్మకంగా మారతారు. కనుక సూర్య సంచారం వీరి ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. గొంతు సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

తుల రాశి వారు తమ మూత్రపిండాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు తీసుకునే ద్రవ పదార్థాల పరిమాణాన్ని నిరంతరం పెంచుతూ ఉండండి. మీరు ప్రేమించే వ్యక్తితో గొడవ పడే అవకాశం ఉంది. మీకు విభేదాలు రావచ్చు.

మకర రాశిలో జన్మించిన వ్యక్తులు తమ లక్ష్యం వైపు నిరంతరం ముందుకు సాగే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సూర్య సంచారము వారి ఆచరణాత్మకతను ప్రభావితం చేస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి.

సూర్య సంచారము కుంభ రాశి వారికి కొన్ని కొత్త మార్పులను తెస్తుంది. కొత్త ఆలోచనలు పుట్టవచ్చు. ఇతరులపై ఆధారపడటం పెరగవచ్చు. వీరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చక్కెర స్థాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే చక్కెర అసమతుల్యత అతనికి సమస్యలను కలిగిస్తుంది.

ఈ ఏప్రిల్ 14 వ తేదీన జరిగే సూర్యుని సంచారము కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందని.. కొన్నింటికి తటస్థంగా ఉంటుందని. కొన్నింటికి ప్రతికూల ప్రభావాలను తెస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.

నివారణ చర్యలు

రోజూ దేవుడిని పూజించండి. సూర్యోదయానికి అరగంట ముందు .. సూర్యోదయం తర్వాత అరగంట తర్వాత సూర్యుడిని క్రమం తప్పకుండా పూజించండి. ఈ పరిష్కారం వలన అందరూ ప్రయోజనం పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.