రేపే హనుమాన్ జయంతి.. ఈ 5రాశులకు అఖండ ధనయోగం!
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి. ఈ రోజున హనుమాన్ భక్తులందరు బ్రహ్మముహుర్తంలో నిద్రలేచి, హనుమంతుడిని పూజిస్తారు. అంతే కాకుండా ఈరోజు ఆలయాలన్నీ హనుమాన్ నామంతో మార్మోగుతాయి. అయితే ఆంజనేయస్వామ జయంతి రోజున సూరయుడు, రాహువు, శని, శుక్రుడు, బుధుడు మీనరాశిలో కలవడం వలన పంచగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ఐదు రాశుల వారికి అఖండ ధన యోగం కలగనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Apr 11, 2025 | 3:35 PM

వృషభ రాశి రాశి వారికి హనుమాన్ జయంతి రోజు నుంచి అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఏ పనులు చేపట్టినా అందులో విజయం పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పని లో విజయం మీ సొంతం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మిథున రాశివారు సంతోషకర వార్తలు వింటారు. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ సంతానం మంచి స్థాయిలో ఉండటం చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అన్నీ మంచి రోజులే ఇక మీకు.

సింహ రాశి వారికి హనుమాన్ జయంతి నుంచి అద్భుతంగా ఉండనుంది. చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం వేయిట్ చేస్తున్న వారికి సబంధం కుదిరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.

వృశ్చిక రాశి వారికి అనుకోని లాభాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయం అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.

కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉండబోతుంది.



