AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన లోయల మధ్య రివర్ రాఫ్టింగ్ చేయాలంటే భారతదేశంలోని బెస్ట్ ప్లేసెస్ ఇవే!

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చల్లని ప్రదేశాలు, పచ్చని చెట్లు, లోయలు ఉండే ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే కొందరు రివర్ రాఫ్టింగ్ ను చాలా ఇష్టపడుతారు. అయితే రివర్ రాఫ్టింగ్ ను ఆస్వాదించాలి అనుకునేవారికి భారత దేశంలోని బెస్ట్ ప్లేసెస్ ఇవేనంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 11, 2025 | 4:56 PM

Share
అలకనంద నది రివర్ రాఫ్టింగ్ కు బెస్ట్ ప్లేస్. గంగానదికి అతిపెద్ద ఉపనది అలకనంద. ఈ నదిలో రాఫ్టింగ్ సవాల్ తో కూడినది. ఇక్కడ రాఫ్టింగ్ చమోలి ప్రాంతం నుంచి రుద్ర ప్రయాగ వరకు కొనసాగుతుంది. ఈ మార్గంలో రాఫ్టింగ్ చేస్తూ ఉత్తరా ఖండ్ పర్వతాలు, లోయలు అందమైన ప్రదేశాలను అస్వాధించవచ్చు.

1 / 5
ఉత్తరా ఖండ్ లోని రిషికేశ్ రివర్ రాఫ్టింగ్ కు ప్రసిద్ధి చెందినది.  రిషికేష్ లోని నాలుగు ప్రదేశాలలో రివర్ రాఫ్టింగ్ జరుగుతుంది. అది బ్రహ్మపురి, శివపురి, మెరైన్ డ్రైవ్,కౌడియాల. ఇక్కడ మీరు రోజంతా జాలీగా రాఫ్టింగ్ వెళ్ల వచ్చును.

2 / 5
సింధు నది రాఫ్టింగ్ కు చాలా ఉత్తమం. లడఖ్ లోని జంస్కర్ పర్వతాలు, అందమైన చెట్లు, పచ్చని ప్రకృతి మధ్య రాఫ్టింగ్ చేయాలి అనుకుంటే సింధు నది బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు రాఫ్టింగ్ కు వెళ్తే మంచుతో కప్పబడిన శిఖరాలు, లోతైన లోయను మిమ్మల్ని ఆకర్షిస్తాయి.

3 / 5
తీస్తా నదిలో రాఫ్టింగ్ కూడా ఆనందించవచ్చు. అందమైన తెల్లని ఇసుక బీచ్‌లు, రాతి ప్రాంతాల మధ్య రాఫ్టింగ్ ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ రాఫ్టింగ్ ఓ జ్ఞాపకంలా ఉంటుందంట.

4 / 5
ముస్సోరీలోని యమునానది కూడా రాఫ్టింగ్ కు ఉత్తమమైనది. ఇక్కడి ఎత్తైన వంతెనలు, లోయల మధ్య రాఫ్టింగ్ చేస్తే అనుభవం చాలా కొత్తగా, ఆనందాని్ని ఇస్తుందంట. అంతే కాకుండా ఉప్పొంగే నీటి మలుపుల గుండా మీరు రాఫ్టింగ్ చేయడం చాలా సరదగా అనిపిస్తుందంట.

5 / 5