- Telugu News Photo Gallery Cinema photos Is this the super hit movie that Ram Charan and Jr. NTR's combination missed?
RRR కాదండోయ్..చెర్రీ, తారక్ కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీ ఇదే!
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ హవా కొనసాగుతుంది. చాలా మంది స్టార్ హీరోలు మల్టీ స్టార్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏంకంగా ఆస్కార్ అవార్డే తీసుకొచ్చింది.ఇక ఈ మూవీలో రామ్ చరణ్, తారక్ నటనకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. కాగా, తాజాగా వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
Updated on: Apr 11, 2025 | 5:18 PM

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించారు. వీరిద్దరు తమ నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అయితే వీరి కాంబోలో త్రిబుల్ ఆర్ కంటే ముందే ఒక సినిమా రావాల్సి ఉండేనంట. కానీ మిస్సైందంట. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే?

రామ్ చరణ్, తారక్ త్రిబుల్ ఆర్ కంటే ముందు చెర్రీ, అల్లు అర్జున్ నటించిన ఎవడు సినిమాలో కలిసి నటించాల్సి ఉండేదంట. ఈ మూవీ రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఎవడు మూవీలో కాజల్, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా నటించగా, అల్లు అర్జున్ కీలక పాత్రలో నటించగా, రామ్ చరణ్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమాలో బన్నీ రోల్ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి జూయిర్ ఎన్టీఆర్ ను సంప్రదించాడంట.

కానీ తారక్ అప్పటికీ చాలా సినిమాలతో బిజీగా ఉండటం వలన ఈ సినిమాను రిజక్ట్ చేశాడంట. దీంతో ఈ మూవీలోకి అల్లు అర్జున్ వచ్చారు. అలా చెర్రీ, తారక్ కాంబోలో రావాల్సిన ఎవడు మూవీ మిస్సైందంట.

ఇక ఎవడు మూవీ రిలీజై యావరేజ్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో చెర్రీ , తారక్ వెండితెరపై సందడి చేసి సక్సెస్ అయ్యారు.



