Almonds for Health: బాదం ఆరోగ్యానికి మేలు.. వీటితో కలిపి తింటే విషంతో సమానం.. అవి ఏమిటంటే..
బాదంపప్పులను ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. బాదంపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శక్తిని పెంచడంలో , వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే బాదంపప్పుతో తినేటప్పుడు కొన్ని విషయాలను నివారించాలి. ముఖ్యంగా బాదం పప్పు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహరాన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం...

బాదం పప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వాటిని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. రోజూ బాదం తినడం వల్ల తెలివికి పదును పెట్టడమే కాకుండా, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అదే సమయంలో రోజూ బాదం తింటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అయితే కొన్ని రకాల బాదంపప్పుతో కలిపి తింటే శరీరానికి ప్రయోజనం చేకూర్చకపోవచ్చు పైగా ఆరోగ్యానికి హానికలిగించవచ్చు కూడా.. బాదంతో కలిపి తింటే హాని కలిగించే కొన్ని పదార్దాలున్నాయని డైటీషియన్ మోహిని డోంగ్రే అంటున్నారు. బాదంపప్పుతో కలిసి వేటిని తినకూడని వాటి గురించి తెలుసుకుందాం.
అధిక ఉప్పు ఉన్న స్నాక్స్
బాదంపప్పులో శరీరానికి మేలు చేసే సహజ కొవ్వులు, పోషకాలు ఉంటాయి. మీరు చిప్స్, నమ్కీన్ లేదా వేయించిన వస్తువులు వంటి ఉప్పు స్నాక్స్ తో బాదం తింటే ఈ కలయిక ఆరోగ్యానికి హానికరం. అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. బాదం ఇచ్చే పోషక ప్రయోజనాలను తగ్గిస్తుంది.
కెఫిన్ ఉన్న వస్తువులు
బాదంపప్పులో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే కెఫిన్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. మీరు బాదంపప్పుతో ఎక్కువ కెఫిన్ తీసుకున్నప్పుడు.. అది నిద్రకు ఆటంకాలు, చిరాకు, హృదయ స్పందన రేటులో అసమతుల్యతకు కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో బాదం, కెఫిన్ వస్తువుల కలయికను నివారించాలి.
అధిక చక్కెర ఆహారాలు
బాదం ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి. అయితే మీరు దానిని స్వీట్లు, చాక్లెట్లు లేదా చక్కెర పదార్థాలతో కలిపి తింటే.. అది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. ఇది డయాబెటిస్ ఉన్న రోగులకు ప్రమాదకరం కావచ్చు.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లతో బాదం తింటే, అది అజీర్ణానికి కారణమవుతుంది. సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. బాదంపప్పులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కలయిక ఉబ్బరం, కడుపు నొప్పి , అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో బాదం తినడానికి ముందు లేదా తరువాత పుల్లని పండ్లకు దూరంగా ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








