చర్మ ఆరోగ్యానికి మేలు చేసే టాప్ 10 సూపర్ ఫుడ్స్.. అస్సలు మిస్సవ్వకండి..!
చర్మం మెరిసిపోవాలంటే కేవలం బయట ప్యాక్‌లు, క్రీములు మాత్రమే కాకుండా లోపలి నుంచి పోషకాలు అందించడమూ అవసరం. కొల్లాజెన్ అనే ప్రొటీన్ చర్మ ఆరోగ్యానికి కీలకం. సహజంగా ఈ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే పండ్లు, ఆకుకూరలు, గింజలు, బ్రోత్ వంటి ఆహారాలను తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.

ప్రతి ఒక్కరి కోరిక మెరిసే, ఆరోగ్యవంతమైన చర్మాన్ని కలిగి ఉండటమే. అయితే శరీరం లోపాల నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చర్మం బయట మెరుస్తుంది. కేవలం క్రీములు, మాస్కులు మాత్రమే కాకుండా చర్మానికి అవసరమైన పోషకాలను అందించాలంటే మనం తీసుకునే ఆహారం చాలా కీలకమైనది. ముఖ్యంగా కొల్లాజెన్ అనే ప్రోటీన్ చర్మాన్ని లావుగా, మృదువుగా, ముడతలు లేకుండా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొల్లాజన్ ఉత్పత్తిని సహజంగా పెంచే ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. అలాంటి టాప్ 10 ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు
నిమ్మ, ఆరెంజ్, ముసంబి వంటి పండ్లలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీరంలో కొల్లాజన్ తయారీలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి, ముడతలు తగ్గుతాయి, కొత్త కణాల ఉత్పత్తి వేగవంతమవుతుంది.
బెర్రీలు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి పండ్లు యాంటీఆక్సిడెంట్లకు మూలాలు. ఇవి చర్మాన్ని కాలుష్యం, వాతావరణ ప్రభావాల నుంచి కాపాడి ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఈ పండ్లలో ఉన్న విటమిన్-సి కూడా కొల్లాజెన్ స్థాయిని పెంచుతుంది.
ఆకుకూరలు
పాలకూర, తోటకూర, మునగాకు కూరలు లాంటి ఆకుకూరల్లో విటమిన్-ఎ, సి, కేల్షియం వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ముడతలు, పొడి చర్మం సమస్యలను తగ్గిస్తాయి.
బ్రోత్
చికెన్ లేదా మటన్ ఎముకలతో తయారయ్యే బ్రోత్‌లో సహజ కొల్లాజన్ ప్రొటీన్ ప్రాచుర్యం ఉంటుంది. ఇది తక్కువ సమయంలో శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచే సహజ మార్గం. చర్మం రఫ్‌నెస్‌ను తగ్గించి సాఫ్ట్‌గా మారుస్తుంది.
అవకాడో
విటమిన్-ఇ, ఒమెగా ఫ్యాట్స్ అధికంగా ఉండే అవకాడో చర్మానికి తేమనిస్తుంది. చర్మాన్ని బయట నుంచి గ్లో చేసేలా చేస్తుంది. ఇందులోని విటమిన్-సి కొల్లాజెన్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బాదం, వాల్‌నట్, ఫ్లాక్స్ సీడ్స్
ఇవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు జింక్‌ను కూడా అందిస్తాయి. జింక్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. ఇవి చర్మానికి బలం కలిగించి, సున్నితమైన నిగారింపు ఇవ్వగలవు.
కాప్సికమ్
కాప్సికమ్‌లో విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది కూడా కొల్లాజన్ నిర్మాణానికి తోడ్పడుతుంది. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. నిగారింపు పెరగడంతో పాటు, చర్మం మృదువుగా మారుతుంది.
టమాటా
టమాటాలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని వాతావరణ ప్రభావాల నుండి రక్షించడంతో పాటు కొల్లాజెన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
గుడ్డు తెల్లసొన
గుడ్డు తెల్ల భాగంలో ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్ తయారీకి అవసరం. ఇది చర్మానికి పటుత్వాన్ని ఇస్తుంది, కాంతివంతంగా మారుస్తుంది.
మొలకలు
పెసలు, మినప్పప్పు లాంటి మొలకలు విటమిన్ సి, ఫోలేట్, ప్రోటీన్లు అధికంగా కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి శక్తివంతంగా మార్చి, ప్రకాశవంతంగా ఉంచుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




