AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rava Appalu: హనుమంతుడి అనుగ్రహం కోసం అప్పాలను సమర్పించాలనుకుంటున్నారా.. రవ్వతో చేసుకోండి ఇలా.. రెసిపీ

రామ భక్త హనుమాన్.. సంకట మోచనుడిగా ప్రసిద్ధి. నిర్మలమైన హృదయంతో కొలిస్తే భక్తుల కష్టాలను తీరుస్తాడని విశ్వాసం. మంగళవారం, శనివారం మాత్రమే కాదు హనుమంతుడి జయంతి రోజున కూడా హనుమంతుడికి ఇష్టమైన అరటిపళ్ళు, తమలపాకులు, సింధూరం, శనగలను నైవేద్యంగా సంపర్పించడంతో పాటు బెల్లం అప్పాలతో చేసిన దండను కూడా వేస్తారు. ఇలా చేయడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా అప్పాలను స్వామికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఈ రోజు రవ్వతో చేసిన బెల్లం అప్పాల రెసిపీ గురించి తెలుసుకుందాం..

Rava Appalu: హనుమంతుడి అనుగ్రహం కోసం అప్పాలను సమర్పించాలనుకుంటున్నారా.. రవ్వతో చేసుకోండి ఇలా.. రెసిపీ
Prasadam Rava Appalu
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 4:51 PM

Share

రామాలయం లేని గ్రామం..హనుమంతుడు లేని రామాలయం కనిపించాడు. ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ అక్కడ హనుమంతుడు ఉంటాడని ప్రతీతి. హనుమంతుడి అనుగ్రహం కలగాలనుకుంటే ముందు అతను శ్రీ రామ భక్తుడై ఉండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. హనుమాన్ జయంతి రోజున సీతారాములను కూడా పూజిస్తారు. హనుమంతుడి ఆలయంలో ప్రదక్షిణ చేసి సిందూర అభిషేకం .. ఆకుపూజ చేసి.. తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించడంతో హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయురారోగ్యాలు,సిరి సంపదలను అనుగ్రహిస్తాడని నమ్మకం. ఈ రోజు హనుమంతుడికి ఇష్టమైన అప్పాలను సింపుల్ గా రవ్వతో తయారు చేయడం ఎలా తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

  1. బొంబాయ్ రవ్వ ( ఉప్మా నూక )- ఒక కప్పు
  2. బెల్లం – ఒక కప్పు
  3. యాలకల పొడి- టేబుల్ స్పూన్
  4. నెయ్యి- రెండు స్పూన్లు
  5. ఇవి కూడా చదవండి
  6. నీళ్ళు- ఒక కప్పు
  7. నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి రవ్వ వేయించాలి. ఇప్పుడు ఆ రవ్వలో తీసుకున్న, యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి నీరు పోసి బాగా మరగనివ్వాలి. ఇందులో నెయ్యి వేసి ఇప్పుడు బెల్లం వేసి కరగ నివ్వాలి. ఇప్పుడు రవ్వ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుతూ రవ్వని ఉడకబెట్టుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపి పక్కకు పెట్టుకోవాలి. రవ్వ స్వీట్ రెడీ అవుతుంది. ఇప్పుడు దానిని చిన్న ఉండలుగా చేసుకుని గారెలు మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి ఎక్కిన తర్వత వాటిని నూనెలో వేసుకుని ఎర్ర రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. వేగిన అప్పాలను రెండు గరిటల మధ్య పెట్టి నొక్కాలి. ఇప్పుడు దానిలోని నూనె వదులుతుంది. వీటిని చల్లార నివ్వండి. అంతే రవ్వ అప్పాలు రెడీ. స్వామికి దండగా గుచ్చి సమర్పించండి. ప్రసాదంగా హనుమంతుడి భక్తులకు పంచండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..