AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puran: ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో తెలిస్తే.. వణికిపోతారు..

గరుడ పురాణం పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి. ఇది వైష్ణ పురాణం. ఈ పురాణానికి ప్రధాన దేవత విష్ణువు. మరణం తరువాత ఆత్మ కదలిక, కర్మల ఆధారంగా లభించే ఫలితాల గురించి చెబుతుంది. ఈ మహాపురాణం.. సనాతన ధర్మంలో ఇది మరణం తరువాత మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. కనుక సనాతన హిందూ మతంలో మరణం తరువాత గరుడ పురాణాన్ని వినాలనే నియమం ఉంది. ఈ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసా..

Garuda Puran: ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో తెలిస్తే.. వణికిపోతారు..
Garuda Puranam
Surya Kala
|

Updated on: Apr 11, 2025 | 7:04 PM

Share

అగ్ని పురాణం తర్వాత గరుడ పురాణం రచించబడింది. ఈ పురాణాన్ని విష్ణువు నుంచి గరుడు విన్నాడు.. తరువాత కశ్యప రుషికి వివరించాడు. మరణం తర్వాత ‘గరుడ పురాణం’ వినడానికి ఒక నిబంధన ఉంది. మరణం తర్వాత జీవి చేసే ప్రయాణం గురించి మాత్రమే కాదు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ ఎలా ప్రయాణిస్తుందో కూడా వివరించారు. గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బాధలు అంతం కావు. భూమిపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి మరణానంతర ఎక్కడగా అతని ఆత్మకు స్థానం లభించదు. అతని ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. ఆత్మహత్య గురించి గరుడ పురాణంలో ఏమి చెప్పారో తెలుసుకుందాం..

అకాల మరణం కారణంగా 7 చక్రాలు అసంపూర్ణంగా ఉంటాయి.

గరుడ పురాణం ప్రకారం జీవితంలోని 7 చక్రాలను పూర్తి చేసిన వారికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. అయితే ఎవరైనా ఒక చక్రాన్ని అయినా సరే అసంపూర్ణంగా వదిలేస్తే.. అతను అకాల మరణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి వ్యక్తుల ఆత్మ చాలా బాధపడవలసి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆకలితో మరణించడం, హింసతో మరణించడం, ఉరి తీసుకోవడం, కాల్చుకుని మరణించడం, పాము కాటుతో మరణించడం, విషం తాగడం లేదా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ అకాల మరణాల వర్గంలోకి వస్తాయి. దీని అర్థం ఈ మరణాలు జీవిత కలాని కంటే సమయానికి ముందే సంభవిస్తాయి.

ఆత్మహత్య మహా పాపం.

మానవుడిగా జన్మ లభించడం చాలా కష్టం. ఈ జీవితం ఎన్నో తపస్సు ఫలం. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే.. అతను నరకం అనుభవించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మానవుడిగా జన్మించే అవకాశం పొందరని నమ్ముతారు. ఎవరైనా మరణించి ఆత్మగా మారినప్పుడు.. అతని ఆత్మని 13 వేర్వేరు ప్రదేశాలకు పంపుతారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే.. అతని ఆత్మని 7 నరకాలలో ఒకదానికి పంపుతారు. అక్కడ అతని ఆత్మా దాదాపు 60,000 సంవత్సరాలు గడపాలి.

ఇవి కూడా చదవండి

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ తిరుగుతూనే ఉంటుంది.

ఆత్మలు సాధారణంగా 3 నుంచి 40 రోజులలో మరొక శరీరాన్ని తీసుకుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు చాలా కాలం పాటు తిరుగుతూనే ఉంటాయి. గరుడ పురాణంలో ఆత్మహత్య అంటే దేవుడి ఇచ్చిన జన్మని అవమానించినట్లుగా వర్ణించారు. కనుక ఆత్మహత్య చేసుకున్న వారికి స్వర్గం లేదా నరకంలో స్థానం లభించదు. వారు ప్రపంచం.. మరణానంతర జీవితం మధ్య చిక్కుకుపోయి అల్లాడుతారు.

ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ మరణం తర్వాత కూడా బాధపడుతుంది.

జీవితంలో ప్రతి ఒక్కరూ సుఖ దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటారు. భూమిపై జీవించడానికి కష్టపడాలి. కానీ గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ మరణం తర్వాత కూడా బాధపడాల్సి ఉంటుంది. అతని ఆత్మ చంచలంగా ఉంటుంది. మరణం తర్వాత కూడా అతని ఆత్మ జీవిన పోరాటాలు, ప్రేమ, దుఃఖం మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మా సంచరించే ఆత్మగానే ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.