Astro Tips: బంగారు ఉంగరం అంటే ఇష్టమా.. ఏ వెలికి ధరించాలి.. ఏ వేలికి ధరిస్తే ఆశుభామో తెలుసా..
చాలా మందికి ఉంగరాలు అంటే ఇష్టం. దీంతో బంగారు ఉంగరాలు ధరిస్తారు. అయితే.. ఈ బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలనేది ముఖ్యం. వాస్తు మరియు జ్యోతిష్యం ప్రకారం ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదం. దీనికి గుండెకు ప్రత్యక్ష సంబంధం ఉందని నమ్ముతారు. అయితే బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించకూడదో మీకు తెలుసా? తెలియకపోతే ఈ రోజు తెలుసుకుందాం..

చాలా మంది బంగారు ఉంగరాలు అంటే ఇష్టం. కొంతమంది ఒకటి రెండు వేళ్ళకు ధరిస్తే.. మరికొందరు అన్ని వేళ్ళకు ధరిస్తారు. అయితే బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలో తెలియదు. తప్పు వేలికి ఉంగరం ధరించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీరు ఏ వేలుకు బంగారు ఉంగరం ధరించాలి? దాని ప్రయోజనాలు ఏమిటి? మీరు బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించకూడదో ఈ రోజు తెలుసుకుందాం..
బంగారు ఉంగరం ఎందుకు ధరించాలి?
హిందూ మతంలో బంగారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. శుభ సందర్భాలు, పండుగలు, వివాహాలకు బంగారాన్ని ఉపయోగిస్తారు. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. బంగారం ఇంటికి గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. బంగారం ధరించడం వల్ల సూర్యుని శక్తి పెరుగుతుంది. ఇది జీవితంలో శుభ యోగాన్ని సృష్టించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. బంగారం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో ధైర్యం, దృఢ సంకల్పం పెరుగుతాయి. కనుక జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించాలని జ్యోతిష్కులు సలహా ఇస్తారు. బంగారం ధరించడం వల్ల శరీరం, మనస్సుపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని నమ్ముతారు.
బంగారు ఉంగరం ఏ వేలుకు ధరించాలి?
ఎవరైనా సరే ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించవచ్చు. ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరంలోని రెండు ఉంగరపు వేళ్లలోని నరాలు గుండెకు అనుసంధానించబడి ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అందువల్ల బంగారు ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరపు వేలుకు ధరించాలి. నిశ్చితార్థం సమయంలో కూడా బంగారు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు మాత్రమే ధరిస్తారు. అయితే చిటికెన వేలికి బంగారు ఉంగరాన్ని కూడా ధరించవచ్చు.
బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించకూడదు?
మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం అశుభం. బంగారు ఉంగరాన్ని ఎప్పుడూ మధ్య వేలుకు ధరించకూడదు. అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇది శనీశ్వరుడి సంబంధించిన వేలు. కనుక మధ్య వేలుకి బంగారం ఉంగరం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలకు అవకాశాలు ఏర్పడతాయి. డబ్బు విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక పొరపాటున కూడా మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించకూడదు.
బొటన వేలికి ఉంగరం ధరించవచ్చా?
బొటనవేలు చంద్రుడిని సూచిస్తుంది. ఎవరైనా బొటనవేలికి ఉంగరం ధరించాలనుకుంటే.. ఈ వేలికి బంగారు ఉంగరానికి బదులుగా వెండి ఉంగరాన్ని ఉపయోగించండి. అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.