AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి స్గావామివారి బంగారు లాకెట్ల పంపిణీ..

హరిహర సుతుడు అయ్యప్పని భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో కొలుస్తారు. అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రవేశపెట్టిన అయ్యప్ప స్వామి ప్రతిమ కలిగిన బంగారు లాకెట్లను విషు పండుగ సదర్భంగా ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్నీ బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ఇప్పటికే చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 50 మంది లాకెట్ల కోసం ఆర్డర్లు బుక్ చేసుకున్నారని..ఇంకా లాకెట్లను ఆర్డర్లు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి స్గావామివారి బంగారు లాకెట్ల పంపిణీ..
Sabarimala Ayyappa Gold Lockets
Follow us
Surya Kala

|

Updated on: Apr 14, 2025 | 7:06 AM

మలయాళం కొత్త సంవత్సరంఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి మాసం పేరు ‘మెదమ్’. ఈ నెలలోని మొదటి రోజే ‘విషు. ఈ రోజున కేరళ వారు విషు పర్వదినంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో హరిహర సుతుడు అయ్యప్ప భక్తులకు ట్రావెన్​కోర్​ దేవస్వం బోర్డు శుభవార్త చెప్పింది. భక్తులకు అయ్యప్ప స్వామి ఉన్న బంగారు లాకెట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బంగారు లాకెట్లు వివిధ రకాలుగా అందుబాటులోకి రానున్నట్లు బోర్డ్ అధ్యక్షుడు చెప్పారు. ఈ రోజు 2, 4, 8 గ్రాముల్లో లాకెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.

భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు..

మూడు వేర్వేరు బరువులలో లాకెట్లు తయారు చేయబడ్డాయి.. రెండు గ్రాముల ధర రూ.19,300, నాలుగు గ్రాముల ధర రూ.38,600, ఎనిమిది గ్రాముల ధర రూ.77,200. బంగారం మార్కెట్ విలువ ఆధారంగా ధర ప్రతి సీజన్‌లో మారుతుంది. స్వామివారి లాకెట్లు కావాలనుకునే భక్తులు రెండు విధాలుగా కొనుగోలు చేయవచ్చు. ప్రధాన ఆలయ సన్నిధానంలో దేవస్వం పరిపాలనా కార్యాలయంలో డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయవచ్చు. లేదా ఆన్ లైన్ (WWW.sabarimalaonline.org) ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ బంగారు లాకెట్​ను స్వామివారి గర్భగుడి లోపల పూజలు నిర్వహించి భక్తులకు అందజేస్తున్నారు. శబరిమల సందర్శించే వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత సుసంపన్నం చేస్తుందనే భావన ఉంది.

జీఆర్‌టీ, కల్యాణ్‌కు బంగారు లాకెట్ల టెండర్లు

అయ్యప్ప స్వామి ఫొటోతో బంగారు లాకెట్లను తయారు చేసి భ్కతులకు అందజేసే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్వహించిన టెండర్లను తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ దక్కించుకున్నాయి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!
కస్టమర్లకు అలర్ట్‌.. మే 1న బ్యాంకులకు సెలవేనా..?
కస్టమర్లకు అలర్ట్‌.. మే 1న బ్యాంకులకు సెలవేనా..?