AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Puja Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఈ రోజు శివుడికి ఈ పరిహారాలు చేసి చూడండి.. శివయ్య అనుగ్రహం మీ సొంతం..

హిందూ మతంలో వారంలో ప్రతి రోజు ఒకొక్క దేవుడికి, ఒకొక్క రాశికి అంకితం చేయబడింది. ఈ నేపధ్యంలో సోమవారం శివుడికి, చంద్రుడికి అంకితం చేయబడింది. సోమవారంశివుడికి పూజ చేయడంతో పాటు, కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక, వృత్తి సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. సోమవారం కొన్ని పరిహారాలు చేయడం వలన శుభాఫలితలను పొందవచ్చు. ఈ రోజు సోమవారం చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం..

Monday Puja Tips: ఆర్ధిక ఇబ్బందులా.. ఈ రోజు శివుడికి ఈ పరిహారాలు చేసి చూడండి.. శివయ్య అనుగ్రహం మీ సొంతం..
Lord Shiva
Surya Kala
|

Updated on: Apr 14, 2025 | 6:31 AM

Share

సోమవారం జ్యోతిషశాస్త్రం, మతపరమైన దృక్కోణంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ రోజు త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి అంకితం చేయబడింది. దీనితో పాటు సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కూడా. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు , భావోద్వేగాలకు కారకంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో సోమవారం రోజున తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక పరిహారాల గురించి కూడా చెబుతుంది. ఇవి చాలా పవిత్రమైనవి. ప్రభావవంతమైనవిగా భావిస్తారు.

సోమవారం రోజున ఈ పరిహారాలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, విజయం, స్థిరత్వం లభిస్తాయి. అలాగే గ్రహాల స్థానం కూడా బాగుంది. మీరు కూడా మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కోరుకుంటే, సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారాలను ప్రయత్నించండి. ఆ పరిష్కారాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

శివలింగానికి పాలతో అభిషేకం:

సోమవారం శివలింగానికి పాలతో అభిషేకం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివలింగానికి ఆవు పాలతో చేసే అబిషేకం వలన జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆవు పాలలో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి శివలింగానికి సమర్పించవచ్చు.

ఇవి కూడా చదవండి

పాలు, ఆహారం దానం:

సోమవారం రోజున పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పాలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్ర దోషం ఉంటే చంద్రుని శుభ ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే నవ గ్రహాల చెడు స్థానం మెరుగుపడుతుంది.

శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించండి:

సోమవారం ఖచ్చితంగా శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అలాగే శివయ్యకు బిల్వ పత్రాలు వేసిన నీరు సమర్పించడం వలన ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉండదు.

సోమవారం ఉపవాసం ఉండండి:

సోమవారం ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైనది. ఆర్దికంగా ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శరీరం, మనస్సు శుద్ధి అవుతాయని నమ్ముతారు. అలాగే శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. సోమవారం ఉపవాసం ఆర్థిక సంక్షోభం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా