Shubh Yoga: మూడు గ్రహాలకు బలం.. ఏప్రిల్, మే నెలల్లో ఆ రాశులకు దశ తిరగడం పక్కా..!
ఏప్రిల్ 13వ తేదీ రాత్రి నుండి మూడు శుభ గ్రహ సంచారాలు జరుగుతున్నాయి. రవి ఉచ్ఛ స్థితి లోకి రావడం, ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు వక్రగతి నుంచి బయటకు రావడం, రవి, చంద్రుల మధ్య సమ సప్తక దృష్టి కలిగి పౌర్ణమి ఏర్పడడం. పౌర్ణమి రోజున చంద్రుడికి విశేషంగా బలం పెరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పురోగతి, వివాహం వంటి అంశాలలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

Telugu Astrology: ఈ నెల 13(ఆదివారం) రాత్రి నుంచి మూడు శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రవి ఉచ్ఛ స్థితి లోకి రావడం, ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు వక్రగతి నుంచి బయటకు రావడం, రవి, చంద్రుల మధ్య సమ సప్తక దృష్టి కలిగి పౌర్ణమి ఏర్పడడం. పౌర్ణమి రోజున చంద్రుడికి విశేషంగా బలం పెరుగుతుంది. అదే రోజున చంద్రుడితో పాటు రవి, శుక్రులకు కూడా బలం పెరగడం వల్ల కొన్ని రాశుల వారికి దశ తిరుగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ ఈ మూడు గ్రహాలకు బలం పెరిగినట్టయితే కొన్ని రాశులవారి జీవితాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులకు శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి ఈ మూడు గ్రహాల అనుకూలత వల్ల ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. సామాన్య ఉద్యోగి సైతం ఉన్నత పదవులకు చేరుకునే అవకాశాలు కలుగుతాయి. సగటు వ్యక్తి కూడా లక్షలు ఆర్జించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి పౌర్ణమి రోజున సహజంగానే బలం పెరుగుతుంది. రవి, శుక్రుల బలం కూడా తోడయ్యే సరికి రాజకీయ ప్రాబల్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కన్య: ఈ రాశికి శుక్ర, రవి, చంద్రులు ముగ్గురూ అనుకూలంగా మారినందువల్ల అనేక విధాలుగా ఉచ్ఛ స్థితి కలగడం ప్రారంభం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మీ సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాల వారితో పరిచయాలు కలుగుతాయి. జీవనశైలిలో బాగా మార్పు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో భారీగా లాభాలు కలుగుతాయి.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండడం, ఉచ్ఛపట్టిన రవి ఈ రాశిని వీక్షించడం, ఈ రాశిలో చంద్రుడికి బలం కలగడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రయత్నపూర్వకం గానే కాక, అప్రయత్నంగా కూడా ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: చతుర్థ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, పంచమ స్థానంలో ఉచ్ఛ రవి, లాభ స్థానంలో పూర్ణ చంద్రుడు ఉండడం వల్ల ఈ రాశివారికి త్వరలో తప్పకుండా దశ తిరుగుతుంది. అదృష్టాలు తలుపు తడ తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది శ్రమ, ప్రయత్నాలతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, తృతీయ స్థానంలో ఉచ్ఛ రవి, భాగ్య స్థానంలో పూర్ణ చంద్రుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. ఆర్థిక పరిస్థితి కనీవినీ ఎరుగని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. విదేశీ సంపాదనకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి.