- Telugu News Photo Gallery Spiritual photos Rahu Transit to Aquarius: Relief from Saturn's Influence for these zodiac signs
Rahu Transit: శని దోషానికి రాహువు అడ్డుకట్ట.. వారి జీవితం నల్లేరు మీద బండి నడకే..!
Rahu and Saturn Transit 2025: రాహువు కూడా శని మాదిరిగానే వ్యవహరిస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. గత మార్చి 29న శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారడంతో మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు శని దోషం ప్రారంభం అవుతున్నప్పటికీ, మే 18న రాహువు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి మారుతుండడంతో ఆ శని దోషం చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. శనికి రాహువు ప్రత్యామ్నాయంగా వ్యవహరించడం జరుగుతుంది. రాహువు కుంభ రాశిలో ఏడాదిన్నర పాటు సంచారం చేస్తున్న సమయంలో ఈ రాశులకు శని దోషం అంటే అవకాశం లేదు.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Apr 14, 2025 | 4:33 PM

మేషం: ఈ రాశికి గత మార్చి 29 నుంచి ఏలిన్నాటి శని ప్రారంభమైంది. దీనివల్ల ఈ రాశివారికి ఆదాయ పరంగా, ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే, మే 18న రాహువు ఈ రాశికి లాభ స్థానమైన కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, ఆదాయం బాగా పెరగడానికి, అనుకున్న పనులన్నీ పూర్తి కావడానికి అవకాశం ఉంది. శని ప్రభావం నుంచి ఊరట కలుగుతుంది.

మిథునం: ఈ రాశికి శనీశ్వరుడు దశమ స్థానంలోకి ప్రవేశించినందువల్ల ఉద్యోగంలో పని భారం పెరగడం, పదోన్నతులు ఆగిపోవడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగడం వంటివి జరుగుతాయి. అయితే, రాహువు కుంభ రాశిలోకి మారిన తర్వాత ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. బదిలీలకు అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి ఇటీవలి వరకూ సప్తమ స్థానంలో ఉండి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెంచిన శనీశ్వరుడు అష్టమ స్థానంలోకి వెళ్లడంతో ఈ రాశివారికి ‘అష్టకష్టాలు’ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, మే 18నుంచి సప్తమ స్థానంలో రాహువు ప్రవేశంతో శని దోషం దాదాపు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.

కన్య: సుమారు రెండున్నరేళ్ల పాటు ఆరవ స్థానంలో సంచారం చేసి ఈ రాశివారిని ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన శనీశ్వరుడు సప్తమ స్థానంలోకి వెళ్లడంతో ఈ రాశివారికి గతుకుల రోడ్డు మీద ప్రయాణం మొదలవుతుంది. అయితే, మే 18న రాహువు ఆరవ స్థానంలో ప్రవేశించడంతో వీరి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది.

ధనుస్సు: గత మార్చి 29న శని నాలుగవ స్థానంలోకి మారడంతో ఈ రాశివారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. దీనివల్ల శ్రమ, తిప్పట, ఒత్తిడి పెరుగుతాయి. మనశ్శాంతి, సుఖ సంతోషాలు తగ్గుతాయి. సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు సమస్యాత్మకంగా మారుతాయి. అయితే, వచ్చే నెల 18న రాహువు తృతీయ స్థానంలోకి మారడంతో ఇటువంటి సమస్యలు ఇక దరిచేరవు. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బిజీ అయిపోతాయి.

కుంభం: ఇటీవలి వరకు ఇదే రాశిలో సంచారం చేసిన శనీశ్వరుడి వల్ల ఈ రాశివారు శశ మహా పురుష యోగాన్ని అనుభవించడం జరిగింది. ఉద్యోగంలో స్థిరత్వం కలిగింది. ధన ధాన్య సమృద్ధికి అవకాశం ఏర్పడింది. మంచి గుర్తింపు లభించింది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోయాయి. శని రాశి మారడంతో వీటన్నిటికీ బ్రేకు పడే అవకాశం ఉంది. మే 18న రాహువు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నందు వల్ల వెనుకటి వైభవం పునరావృతం అవుతుంది. ఆడింది ఆటగా పాటగా సాగిపోతుంది.





























