Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
ఆచార్య చాణుక్యుడు రాజ్య పాలన గురించి మాత్రమే కాదు.. మనిషి జీవన విధానం గురించి కూడా చెప్పాడు. చాణక్య రాసిన నీతి శాస్త్రంలో రాజ్యపాలన, భార్యాభర్తల బంధం, స్నేహితులు డబ్బుల నిర్వహణ ఇలా ప్రతి విషయాన్నీ తెలియజేశాడు. ఇవి నేటికీ మానవులను అనుసరణీయం అని చెబుతారు. ప్రతి మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యం.. అయితే స్నేహం చేసేసమయంలో ప్రత్యేకంగా కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలని చాణక్యుడు సూచించాడు. చాణక్య నీతి ఏం చెబుతుందో తెలుసుకోండి...

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త మాత్రమే కాదు ఆర్థికవేత్త కూడా. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో మానవ సమాజ సంక్షేమానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఒక వ్యక్తి దాని విధానాలను తన జీవితంలోకి చేర్చుకుంటే.. అనేక సమస్యలను పరిష్కరించవచ్చని అంటారు. జీవితంలో ఎలాంటి స్నేహితులను ఎలా కలిగి ఉండాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు.
ఆచార్య చాణక్యుడి విధానాలు, ఆలోచనలు జీవితంలో ఆచరించాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగా, కఠినంగా అనిపించవచ్చు. అయితే కఠినత్వం జీవితంలో విజయానికి దారితీస్తుంది. ఎవరైనా చాణక్య ఆలోచనలను ఆచరిస్తే అవి జీవితంలోని ప్రతి అడుగులోనూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
ముఖాముఖి మాట్లాడే స్నేహితులు మంచివారు.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో నిజమైన స్నేహితుడికి నిర్వచనాన్ని వివరించాడు. నిజమైన స్నేహితుడు అంటే మీ వెనుక మీకు హాని చేయనివాడు. మీ స్నేహితుడు మీ వెనుక చెడు పనులు చేస్తుంటే, అతనికి దూరంగా ఉండటం మంచిది. ఈ రకమైన స్వభావం కలిగిన స్నేహితులు చాలా ప్రాణాంతకం. స్నేహం అంటే చాణక్యుడు ఉద్దేశ్యం ఏమిటంటే.. మీ వెనుక చెడు చేసేవారి కంటే మీ ఎదుటే చెడు చేసేవారు మంచివారు. మీ ముఖం మీద చెడుగా మాట్లాడేవారు కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ.. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడే వారి కంటే ఇలాంటి వారే మంచివారు.
కొన్ని రహస్యాలు స్నేహితులకు చెప్పకూడదు.
ప్రతి ఒక్కరూ జీవితంలో కొంతమందిని కలుస్తారు. వారి స్నేహాన్ని గొప్పగా భావిస్తారు. దీంతో వారి స్నేహం నిజమైందిగా భావించి తమ స్నేహితులతో ప్రతిదీ పంచుకునే వారు కూడా కొందరు ఉంటారు. కొన్నిసార్లు అతి రహస్యాలను కూడా స్నేహితులతో భావోద్వేగంతో పంచుకుంటూ ఉంటారు. అయితే అవకాశ వాదంతో స్నేహం చేసే స్నేహితులకు అవకాశం వచ్చినప్పుడు.. వారు మీ రహస్యాలను ఇతరులకు చెబుతారు. కనుక పొరపాటున కూడా కొన్ని రహస్యాలు ఇతరులకు చెప్పకూడదు.
స్నేహం పేరుతో వంచన చేసే వ్యక్తులు మీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు చింతించరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా చేస్తున్నప్పుడు వారు చెడుగా భావించరు. అందుకే ఆచార్య చాణక్యుడు అలాంటి స్నేహితుల కంటే శత్రువులు మేలు అని చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.