Varuthini Ekadashi: వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత? వరాహ అవతారాన్ని ఎందుకు పూజిస్తారో తెలుసా..
ప్రతి సంవత్సరం చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశి రోజున వరూథిని ఏకాదశిగా ఉపవాసం పాటిస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన వరూథిని ఏకాదశిని జరుపుకోనున్నారు. శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు పొందడానికి ఏకాదశి రోజున చేసే పూజ, ఉపవాసం చాలా మంచిదని భావిస్తారు. వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం..

ప్రతి సంవత్సరం చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథిని వరూథిని ఏకాదశిగా ఉపవాసం పాటిస్తారు. ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ 24న జరుపుకోనున్నారు. వరూథిని ఏకాదశి రోజున భక్తులు శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ అవతారాన్ని పూజిస్తారు. ప్రార్థనలు చేస్తారు. అలాగే ఆశించిన ఫలితాలను పొందడానికి వరూధుని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..
వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?
వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన ఆనందం, అదృష్టం పెరుగుతుందని విశ్వాసం ఉంది. అంతేకాదు భక్తులు తమకున్న కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. అదే సమయంలో వరూథిని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా మరణం తర్వాత వైకుంఠ లోకంలో స్థానం పొందుతారని, అంటే ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వలన మనిషి ఇహ పర లోకాల్లో ఆనందం పొందుతారని నమ్మకం. దీనితో పాటు, వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ద్వారా వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు.
వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు పాటిస్తాము?
- వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అదృష్టం, ఆనందాన్ని అందిస్తుందని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేయడం వలన వ్యక్తిని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ రోజున చేసే ఉపవాసం, పూజ ఆనందం, మోక్షం రెండింటినీ అందిస్తుంది. వరూథిని ఏకాదశి ఉపవాసం చేయడం వలన శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు లభిస్తాయని.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని మత విశ్వాసం.
- పాప విముక్తి:- వరూథిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా మనిషి చేసిన పాపాలు నశించి, అతను మోక్షాన్ని పొందుతాడని నమ్మకం.
- ఆనందం, శ్రేయస్సు: – ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, కీర్తి లభిస్తాయి.
- స్వర్గప్రాప్తి:- వరూథిని ఏకాదశి ఉపవాసం ఆచరించే వ్యక్తి మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతాడని నమ్ముతారు.
- విష్ణువు అనుగ్రహం:- వరూథిని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.