Vidur Niti: ఒంటరితనంలో ప్రమాదం దాగి ఉంది.. ఈ 4 పనులు పొరపాటున కూడా ఒంటరిగా చేయవద్దు..
కాలం ఎంతగా మారినా కాలానుగుణంగా పెద్దలు చెప్పిన నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. అయితే మనిషి ఎంతగా మారిన... కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు. అలాంటిదే విదర నీతి. సమాజానికి విదురు చెప్పిన నీతి ఎంతో ముఖ్యం. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ చెప్పిన నీతులకు ఏ యుగంలోనైనా విలువ చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. జ్ఞానులకు, మూర్ఖులకు మధ్య తేడాని మాత్రమే కాదు.. మనిషి ఎప్పుడూ చేయకూడని పనుల గురించి కూడా చెప్పాడు.

మహాభారతంలోని గొప్ప పాత్రల్లో విదురుడు ఒకరు. కృష్ణ భక్తిపరుడు, జ్ఞానవంతుడు మాత్రమే కాదు.. విదురుడి విధానం, న్యాయం , సత్యానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతున్నాయి. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి. ఆచరణాత్మకమైనవి. హస్తినా పురానికి ప్రధానమంత్రిని నిర్వహించిన విదురుడు రాజు తన ఎదురుగా ఉన్నప్పటికీ నిజాన్ని, సత్యాన్ని నిర్భయంగా మాట్లాడేవాడు. అందుకే విదురుడు ప్రతి యుగంలో ఆదర్శవంతమైన రాజనీతిజ్ఞుడిగా పరిగణించబడుతున్నాడు. విదురుడు, ధృతరాష్ట్రుడి మధ్య జరిగిన సంభాషణను ‘విదుర నీతి’ అని పిలుస్తారు., ఇది కేవలం ఒక శాస్త్రీయ గ్రంథం మాత్రమే కాదు..నేటి కాలానికి మార్గదర్శి కూడా. విదురుడు చెప్పిన సూత్రాలను అవలంబిస్తే.. అతను తన వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడమే కాదు తన వృత్తి జీవితంలో కూడా ఉన్నత శిఖరాలను చేరుకోగలడని విదురుడు అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన మార్గాన్ని ఎలా అనుసరించాలో విదురుడి విధానాలు నేటికీ మనకు నేర్పుతాయి. అదేవిధంగా విదుర నీతిలో కొన్ని పనులు ఒంటరిగా చేయడం మంచిది కాదని పేర్కొన్నాడు.
- మహాత్మా విదురుడు చెప్పినట్టు రుచికరమైన ఆహారం దొరికినప్పుడు.. దానిని ఒంటరిగా తినకూడదు. రుచికరమైన ఆహారాన్ని ఎల్లప్పుడూ ఇతరులతో పంచుకోవాలి.
- విదుర నీతి ప్రకారం ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు..దాని గురించి ఎవరినైనా అడగడం సముచితం. ఏ నిర్ణయం ఒంటరిగా తీసుకోకూడదు లేదా ఏ పనులను ఒంటరిగా చేయాలను కోరుకోకూడదు.
- విదుర నీతి ప్రకారం.. ఏ వ్యక్తి ఒంటరిగా మార్గంలో నడవకూడదు. వీలైనంత వరకు కొత్త మార్గంలో ఒంటరి ప్రయాణాన్ని నివారించాలి.
- విదుర నీతి ప్రకారం.. చాలా మంది ప్రజలు ఉండి.. అందరూ నిద్రపోతున్న చోట.. ఒంటరిగా మేల్కొని ఉండటం వ్యర్థం. అటువంటి పరిస్థితిలో పది మంది నిద్రపోతున్నప్పుడు ఒంటరిగా మేల్కొని ఉండడం మంచిది కాదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.