Char Dham Yatra: ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా ఛార్ ధామ్ యాత్ర చేయాలనీ ఎందుకు అనుకుంటాడో తెలుసా..
హిందూమతంలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ యాత్రకు ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చేయాలనీ కోరుకుంటాడు. ఈ నాలుగు ప్రవిత్ర క్షేత్రాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు ప్రధాన యాత్రా స్థలాలను కొన్ని నిబంధనలతో భక్తులు దర్శించుకోవచ్చు. చార్ ధామ్ అనే పేరుకు "నాలుగు నివాసాలు" అని అర్థం. ఈ యాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. చార్ ధామ్ యాత్ర ఎందుకు చేస్తారనే ప్రశ్న చాలా మందిలో కలిగి ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు చార్ ధామ్ యాత్ర హిందువులకు ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం..

చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ నాలుగు ధామ్‌లను సందర్శించడం ద్వారా మోక్షం లభిస్తుంది. చార్ ధామ్ యాత్ర మతపరమైన, ఆధ్యాత్మిక దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా హిందూ మతంలోని ప్రతి వ్యక్తి చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని కోరుకుంటాడు. జీవితంలో ఒక్కసారైనా చార్ ధామ్ యాత్రను సందర్శించాలని కొందరు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు చార్ ధామ్ యాత్ర ఎందుకు అవసరమో, దాని ప్రాముఖ్యత ఏమిటి? సరైన పద్దతిలో ఈ యాత్ర ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం…
2025 లో చార్ ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న తెరుచుకోనుండగా, బద్రీనాథ్ ధామ్ తలుపులు మే 4న తెరుచుకుంటాయి.
చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి?
చార్ ధామ్ యాత్ర అంటే (యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్) నాలుగు పవిత్ర ప్రదేశాలను సందర్శించేందుకు చేసే యాత్ర.. ఇది ఒక ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర. ఈ ప్రయాణంలో హిమాలయాలలో ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనను సూచిస్తుంది. ఈ యమునోత్రి నుంచి ప్రారంభమై, గంగోత్రి, కేదార్‌నాథ్ గుండా వెళ్లి బద్రీనాథ్‌తో ముగుస్తుంది.
చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?
- చార్ ధామ్ యాత్ర చేయడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని.. మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని ఒక మత విశ్వాసం ఉంది. ఈ ప్రయాణం భక్తులు ప్రాపంచిక బంధనాల నుంచి విముక్తి పొంది జ్ఞానోదయం పొందడానికి సహాయపడుతుంది.
- మోక్ష సాధన: చార్ ధామ్ యాత్ర చేయడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. అనగా జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది.
- పాప వినాశనం: నాలుగు వేర్వేరు దేవతలకు అంకితం చేయబడిన ఈ తీర్థయాత్ర ఒక వ్యక్తి చేసిన పాపాలన్నింటినీ తొలగించి శుద్ధి చేస్తుంది.
- ఆత్మసాక్షాత్కారం: చార్ ధామ్ యాత్ర భక్తులు వారి అంతర్గత మనసుని శుద్ధి చేయడమే కాదు జీవత సత్యాన్ని, స్వీయ జ్ఞానాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది.
- ఆధ్యాత్మిక అనుభవం: ఈ ప్రయాణం భక్తులకు అతీంద్రియ, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది, ఇది వారికి శాంతి, సంతృప్తిని ఇస్తుంది.
హిందువులు నాలుగు ధామాలను ఎందుకు సందర్శించాలి?
సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితకాలంలో చార్ ధామ్‌ను సందర్శిస్తే.. అతను జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. కేదార్‌నాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించిన తర్వాత నీటిని సేవించే భక్తుడు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. కనుక ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో చార్ ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటాడు.
మనం ముందుగా ఏ పవిత్ర స్థలాన్ని సందర్శించాలి? (చార్ ధామ్ యాత్ర క్రమం)
చార్ ధామ్ యాత్రలో ముందుగా యమునోత్రి ధామ్ సందర్శించాలి. యమునోత్రి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే, చార్ ధామ్ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు. చార్ ధామ్ యాత్రను సవ్యదిశలో పూర్తి చేయాలి.
- యమునోత్రి – చార్ ధామ్ యాత్రలో మొదటి గమ్య స్థానం.
- గంగోత్రి – చార్ ధామ్ యాత్ర రెండవ సందర్శన క్షేత్రం.
- కేదార్‌నాథ్ – చార్ ధామ్ యాత్రలో మూడవ గమ్య స్థానం
- బద్రీనాథ్ – చార్ ధామ్ యాత్రలో నాల్గవది.. చివరిది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.