Herbal Tea: ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. క్యాన్సర్ సహా ఎన్ని వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయో తెలుసా..
చాలా మంది తమ దైనందిన జీవితాన్ని కాఫీ లేదా టీతో మొదలు పెడతారు. వ్యక్తిగత అభిరుచి, అవసరాల ఆధారంగా కొంతమంది టీ ని రోజులో అనేక సార్లు తాగుతారు. అయితే మిల్క్ టీని ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా టీ తాగకపోతే రోజులో ఏదో వెలితిగా భావించేవారు చాలామంది ఉన్నారు. దీంతో టీకి బదులుగా హెర్బల్ టీని తాగడం మొదలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని రకాల హెర్బల్ టీల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Apr 14, 2025 | 9:05 AM

అల్లం టీ : మిల్క్ టీకి బదులుగా రోజుని అల్లంటీతో మొదలు పెట్టడం ఆరోగ్యానికి ఓ వరం అని అంటున్నారు నిపుణులు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు వేడివేడి అల్లం టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఊరిపితిత్తులు శుభ్రపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అల్లం టీలో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి కనుక శ్వాసకోశ వాపు తగ్గడంతో పాటు శ్వాసరేటు మెరుగుపడుతుంది.

గ్రీన్ టీ : గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల్లో వచ్చే వాపును తగ్గించే సామర్ధ్యం ఉన్నాయి కనుక రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఊపిరితిత్తుల పని తీరు బాగుంటుంది. అంతేకాదు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది.

పసుపు టీ : పసుపు టీలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్పెక్షన్లతో పోరాడే శక్తి ఉంది. శ్వాసకోశ వాపును తగ్గిండమే కాదు దీనిలోని యాంటీ ఇంప్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. ముఖ్యంగా సీఓపీడీ (COPD) రోగుల్లో ఊపిరిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పుదీనా టీ : పుదీనా టీలో ఔషధ గుణాలున్నాయి. పుదీనాలో ఉన్న ఔషధ గుణాలు నాసికా కుహరాలు, శ్వాస నాళాలను శుభ్రం చేస్తాయి. తద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్పారు. ఈ టీలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి.

తులసి టీ : తులసిలో అనేక ఔషధగునాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో తులసి టీ తాగడం వలన శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించడంతో పాటు శ్వాసకోశ వాపును తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

యూకలిప్టస్ టీ : యూకలిప్టస్ ఆకుల్లో సినోల్ అధికంగా ఉంది. ఇది శ్లేష్మాన్ని తగ్గించడంతో పాటు శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు యూకలిప్టస్ టీ మంచి సహాయకారి.





























