- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma one decision like captain change the match for Mumbai Indians against Delhi Capitals, DC vs MI
Rohit Sharma: దటీజ్ రోహిత్.. డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన హిట్‌మ్యాన్
Rohit Sharma one decision Change DC vs MI Result: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాకపోవచ్చు. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదే పాత్రలో కనిపించాడు. రోహిత్ మైదానంలో లేకపోయినా, డగౌట్‌లో కూర్చుని ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఒకే ఒక్క నిర్ణయంతో ఎవ్వరూ ఫలితాన్ని రాబట్టాడు.
Updated on: Apr 14, 2025 | 9:45 AM

Rohit Sharma one decision Change DC vs MI Result: రోహిత్ శర్మ ఒక నిర్ణయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని ఖాయం చేసింది. డగౌట్‌లో కూర్చున్న హిట్‌మ్యాన్.. మైదానంలో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఊహించలేని గిఫ్ట్ అందించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ (IPL) 2025 లో రోహిత్ శర్మ తన బ్యాట్‌తో అద్భుతాలు చేయలేకపోవచ్చు. కానీ, అతను అద్భుతమైన పాచికతో మ్యాచ్ గమానాన్ని మార్చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ తర్వాత డగౌట్ నుంచి రోహిత్ శర్మ మ్యాచ్‌ను ఊహించని ఫలితం వైపు తీసుకెళ్లాడు.

ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనేకు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతో ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. నిజానికి, 13వ ఓవర్ తర్వాత బంతిని మార్చమని రోహిత్ జయవర్ధనేకు సలహా ఇచ్చాడు. కొత్త బంతితో, వికెట్ రెండు చివర్ల నుంచి స్పిన్నర్లను బరిలోకి దింపాలని సూచించాడు. ఆ సమయానికి లక్ష్యానికి దగ్గరైన ఢిల్లీ జట్టు.. రోహిత్ నిర్ణయం తర్వాత అధ్వాన్నంగా మారిపోయింది.

రోహిత్ సలహాను అనుసరించి, ముంబై ఇండియన్స్ కొత్త బంతితో ఒక ఎండ్ నుంచి కర్ణ్ శర్మను, మరొక ఎండ్ నుంచి సాంట్నర్‌ను బౌలింగ్‌కు దింపింది. దాని ఫలితం తరువాతి 3 ఓవర్లలో కనిపించింది. ఈ సమయంలో ఇద్దరు బౌలర్లు కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చారు. అదే సమయంలో, కర్ణ్ శర్మ ఢిల్లీకి చెందిన ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. వారిలో డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్, ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ పేర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా, గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది తొలి ఓటమి. ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌ల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది.





























