Swapna Shastra: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అర్ధమట..
కలలు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలను ముందుగానే చెబుతాయని స్వప్న శాస్త్రం వెల్లడిస్తుంది. కొన్ని కలలు ఒక వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తాయి. మరికొన్ని కలలు అశుభ సంకేతాలను ఇస్తాయి. స్వప్న శాస్త్రంలో ఎవరికైనా కొన్ని రకాల కలలు వివాహం జరగనుందని ముందస్తు సూచన. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల కలలను ఇంట్లో త్వరలో వివాహం జరగనుందని తెలియజేస్తాయట.

నిద్రలో కలలు రావడం సహజం. కొన్ని కలలు భయంకరంగా అనిపిస్తే.. మరికొన్ని కలలు సంతోషం కలిగిస్తాయి. అదే సమయంలో కొన్ని కలలను అర్థం అర్థం చేసుకోవడం కష్టం. ప్రతి వ్యక్తి కనే ప్రతి కలకి ఏదో ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం వెల్లడించింది. అటువంటి పరిస్థితిలో కొన్ని రకాల సంఘటనలు, విశేషాలు మీ కలలో చూసినట్లయితే.. మీ వివాహ కల త్వరలో నెరవేరుతుందని అర్థం. అటువంటి పరిస్థితిలో స్వప్న శాస్త్రం ప్రకారం పెళ్లి జరగనుంది అనే విషయాన్ని తెలిపే కలల గురించి తెలుసుకుందాం. ఆ కలలకు అర్ధం మీకు లేదా మీ ఇంట్లో త్వరలో పెళ్లి వాయిద్యాలు మ్రోగనున్నాయని అర్ధం.
ఏ వ్యక్తి అయినా తన కలలో వివాహ ఊరేగింపును చూసినట్లయితే అది శుభ సంకేతం అని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఈ కలకు అర్థం మీకు అతి త్వరలో వివాహం జరగనుందని అర్ధమట.
అంతేకాదు ఒక వ్యక్తి కలలో ఎవరినైనా తన ప్రేమికుడిగా చూసినట్లయితే.. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందగలరని కూడా ఇది సూచిస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు.
మీరు మీ ప్రేమికుడితో తిరుగుతున్నట్లు కలలో కనిపిస్తే.. ఈ కలకు అర్ధం మీకు త్వరలో వివాహం జరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. ఈ కలకు మరొక అర్థం ఏమిటంటే మీరు మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు.
ఒక అమ్మాయి తన కలలో తలపాగా ధరించిన అబ్బాయిని చూస్తే.. ఈ కలకు అర్ధం మీ వివాహం త్వరలో జరగవచ్చని సూచిస్తుంది. మరోవైపు ఒక అబ్బాయి కలలో ఎవరైనా తలపాగా ధరించి ఉన్నవారు కనిపిస్తే అతనికి త్వరలో పెళ్లి జరగబోతున్నదని కూడా అర్థం.
స్వప్న శాస్త్రం ప్రకారం అమ్మాయి కలలో చేతిలో పూలు పట్టుకున్న అబ్బాయిని చూస్తే.. మీకు ఒక సంబంధం రానుందని.. పెళ్లి కుదురుతుందని నమ్ముతారు. మరోవైపు మీరు మీ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నట్లు కలలో చూసినట్లయితే.. మీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని అర్థం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.