AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medimix Soap History: మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..? అస్సలు ఊహించలేరు

మెడిమిక్స్ సోప్.. చాలా మందికి సుపరిచితమే. మార్కెట్లలో ఎన్ని రకాల సబ్బులు వచ్చినా, మెడిమిక్స్ తప్ప మరేదీ వాడని వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. చాలామంది అమ్మాయిలు ఈ సబ్బును ఎక్కువగా వినియోగిస్తుంటారు కూడా. కానీ ఈ మెడిమిక్స్ సబ్బు అమ్మాయిల కోసం తయారు చేయబడిందని మీరు..

Medimix Soap History: మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..? అస్సలు ఊహించలేరు
Medimix Soap
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 14, 2025 | 1:47 PM

మెడిమిక్స్ సోప్ గురించి తెలియనివారుండరు. దీని సువాసనకు ఎవరినైనా ఇట్టే ఆకర్షించే శక్తి ఉంటుంది మరి. మార్కెట్లలో ఎన్ని రకాల సబ్బులు వచ్చినా, మెడిమిక్స్ తప్ప మరేదీ వాడని వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. చాలామంది అమ్మాయిలు ఈ సబ్బును ఎక్కువగా వినియోగిస్తుంటారు కూడా. కానీ ఈ మెడిమిక్స్ సబ్బు అమ్మాయిల కోసం తయారు చేయబడిందని మీరు అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 50 యేళ్ల చరిత్ర కలిగిన ఈ మెడిమిక్స్‌ సబ్బు తయారీ వెనుక అసలు ఉద్దేశ్యం వేరేఉంది మరి.. అవును, ఈ సబ్బు వేరే ప్రయోజనం కోసం తయారు చేశారట. కానీ అది తెలియని అమ్మాయిలు దానిని తమ కోసమే అన్నట్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది తప్పు కాదు. కానీ.. ఈ సబ్బు తయారీ ఉద్దేశ్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎందుకంటే తొలినాళ్లలో ఈ సబ్బును రైల్వే కార్మికుల కోసం తయారు చేశారట.

అవును.. మెడిమిక్స్ సబ్బును రైల్వే కార్మికుల కోసం తయారు చేశారు. రైల్వే కార్మికులలో తరచుగా వచ్చే అలెర్జీలు, చర్మ సంబంధిత సమస్యలను గమనించిన రైల్వేలో పనిచేసే డాక్టర్‌ వి.పి. సిధాన్.. వారి కోసం ప్రత్యేకంగా చేతులతోనే ఈ సబ్బులను తయారు చేశాడు. ఎందుకంటే వారికి మందు తయారు చేస్తే, వారు దానిని తీసుకుంటారో లేదో? అన్న అనుమానంతో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలను ఉపయోగించి ఆయన తొలిసారి ఈ సబ్బులను తయారు చేశారు. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా సువాసనను కూడా అందించింది. దీనిలో ఉపయోగించే పదార్థాలు చర్మ అలెర్జీలను బలేగా నివారించాయి.

డాక్టర్‌ వి.పి. సిధాన్ ఆలోచన నుంచి వచ్చిన ఈ సబ్బుకు 1969లో విపరీతంగా డిమాండ్ పెరిగింది. అధికంగా వీటిని ఉత్పత్తి చేసి రైల్వే కార్మికులకు పంపిణీ చేయడం ప్రారంభించారు. నేడు, ఈ కంపెనీ పెద్ద స్థాయికి ఎదిగింది. ఈ సబ్బులను ప్రతిరోజూ లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు రైల్వే కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడిన ఈ సబ్బు చరిత్ర నిజంగా గర్వకారణం.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.