- Telugu News Photo Gallery Smoking in an AC room can be dangerous, know how it can affect your heart, brain and kidney
Smoking in AC Room: ఏసీ గదుల్లో సిగరెట్ స్మోకింగ్ చేసే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
ముఖ్యంగా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మొదటి ప్రమాదం మీ ఏసీ ఎప్పుడైనా పేలవచ్చు. రెండవది ఇది ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే..
Updated on: Apr 14, 2025 | 1:32 PM

ఈ ఎండలో ఏసీ లేకుండా ఎక్కువసేపు ఉండటం కష్టం. అయితే ధూమపానానికి బానిసైన వారు వేళాపాళలేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడే స్మోక్ చేస్తుంటారు. దీంతో చల్లని ఏసీ గదుల్లోనూ వారు పొగ తాగుతుంటారు. ఇలా బయటికి వెళ్లకుండా ఏసీ గదుల్లోనే పదే పదే పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు.

Smoking

smoking

పరోక్షంగా సిగరెట్ పొగకు గురయ్యే వారికి కూడా ఈ అలవాటు ప్రాణాంతకం కావచ్చు. అతిగా ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. మీకు గుండె సమస్యలు ఉంటే, అది మరింత క్లిష్టంగా మారుతుంది.

ఇంట్లో AC ఆన్‌లో ఉన్నప్పుడు మూసివేసిన గదిలో సిగరెట్ తాగడం వల్ల పొగ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతంలో వ్యాపిస్తుంది. సిగరెట్ పొగ శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినట్లే, అశుద్ధమైన ఇంటి లోపల గాలి కూడా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా శ్వాసకోశ వ్యవస్థకు జరిగే నష్టం అంతాఇంతాకాదు.




