ఏబీసీ జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల ముఖంపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే చర్మం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది.

మంచి ఆరోగ్యం కావాలని కోరుకునే వారికి ఇదో చక్కటి ఉపాయం.. కొన్ని రకాల పండ్లు, కూరగాయల జ్యూస్‌లతో మెరుగైన ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి పండ్లు, కూరగాయలతో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో అతి ముఖ్యమైనది ఏబీసీ జ్యూస్. ఈ జ్యూస్ రెగ్యూలర్‌గా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఏబీసీ జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి.. కాగా వంద మిల్లీలీటర్ల ఏబీసీ జ్యూస్ తీసుకోవటం వల్ల 45-50 కేలరీలు, 10-12 గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏబీసీ జ్యూస్‌లో 8 నుంచి 9 గ్రాముల వరకు షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0. 5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. కాగా ఈ జ్యూస్ తాగితే.. హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల ముఖంపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే చర్మం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది.
ఏబీసీ జ్యూస్‌తో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను పెంచడానికి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్ ని నియంత్రించడమే కాదు.. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా తాగడం వల్ల ఎన్నో ప్రమాదకర సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..