హోటల్ స్టైల్‌లో పూరీలు పొంగాలంటే ఇలా ట్రై చేయండి.. బెలూన్‌లా వస్తాయి.. ఇంకా సూపర్ టేస్టీ!
చాలా మందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లో పూరీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. వేడి వేడి పూరీ, దాంతో పాటు పూరీ కర్రీ ఇష్టంగా తింటూంటారు చాలామంది. ఇక హోటల్‌లో చేసిన పూరీలు, ఇంట్లో తయారు చేసిన వాటికంటే మరింత టెస్ట్‌గా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది బయట టిఫిన్ చేయాలంటే పూరీలను తింటుంటారు. ఇంతకీ హోటల్‌లో పూరీలు అంత రుచిగా, ఉండి.. బెలూన్ల ఎలా తయారు చేస్తారో తెలుసా..?

హోటల్లో పూరీ తింటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒక్కో పూరీ గుండ్రంగా, బెలూన్‌లా ఉబ్బి కాస్త కరకరలాడుతూ, మెత్తగా కూడా ఉంటాయి. కానీ.. ఇంట్లో పూరీలు తయారు చేస్తే మాత్రం తేడాగా ఉంటాయి. సరిగా పొంగవు. మెత్తగా కూడా ఉండవు. ఇంకా.. రొట్టెల్లా గట్టిపడతాయి. మరి.. ఎందుకిలా? హోటల్లో మాదిరిగా మన ఇంట్లో పూరీలు కూడా చక్కగా పొంగుతూ రావాలంటే ఏం చేయాలి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం…
హోటల్లో ప్రతి పూరీ పొంగుతుంది. మరి ఇంట్లో చేసే పూరీ కూడా బాగా పొంగాలంటే ఇలా ట్రై చేయండి..
ముందుగా కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి – 500 గ్రాములు, మైదా – 100 గ్రాములు, రవ్వ – 50 గ్రాములు, నూనె 50 మి.లీ. డీప్‌ఫ్రైకి సరిపడా కూడా తీసుకోవాలి. ఇక పిండిని తడుపుకోవడానికి కావాల్సినంత నీరు. మీ రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.
పిండి తయారీ విధానం:
500 గ్రాముల గోధుమ పిండి, 50 గ్రాముల రవ్వ, 100 గ్రాముల మైదా కలపండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులోనే 50 గ్రాముల నూనె వేయండి. మీరు పిండికి నూనె వేసి కలపడం వల్ల, పూరీలు వేయించేటప్పుడు మీకు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పూరీ పిండికి అవసరమైనంత నీరు పోసి బాగా పిసికి కలుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని ఓ10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా నాని మరింత స్మూత్‌గా అవుతుంది. పది నిమిషాల తర్వాత, పిండిని మళ్ళీ మీ అరచేతులతో నొక్కండి. పూరీ పిండిని చిన్న ఉండలుగా చేసి, పిండిని చుట్టేటప్పుడు గోధుమ పిండిని ఉపయోగించి పూరీ చేయండి.
ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి, పూరీలను వేయించుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత, మరోవైపు తిప్పితే, పూరీ ఎర్రగా మారి బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. మీకు నచ్చిన పూరీ కర్నీ, లేదంటే చికెన్, మటన్‌తో కూడా లాగించేయొచ్చు..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..