AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చర్మం కాంతివంతం చేసే శెనగపిండి ఫేస్ ప్యాక్.. ఇలా వాడితే అందం రెట్టింపు అవ్వడం ఖాయం..!

ఇలా చేయడం వల్ల మీ చర్మంపై మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు, మీ చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. సాధరణంగా వేసవిలో చర్మం చెమట కారణంగా జిడ్డుగా మారుతుంది. ఎండకు బాగా కందిపోయినట్టుగా మారుతుంది. అలాంటప్పుడు తరచూ ముఖానికి శెనగపిండి ప్యాక్‌లను అప్లై చేయటం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మం కాంతివంతం చేసే శెనగపిండి ఫేస్ ప్యాక్.. ఇలా వాడితే అందం రెట్టింపు అవ్వడం ఖాయం..!
Besan For Skin
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 14, 2025 | 7:25 PM

అందమైన ముఖం కావాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఖరీదైన కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులను వాడుతుంటారు. మరికొందరు వంటింట్లో లభించే పదార్థాలతోనే అందానికి మెరుగులు పెడుతుంటారు. అలాంటి చర్మ సౌందర్య ఉత్పత్తులలో శెనగపండి అతి ముఖ్యమైనది. శెనగపిండి మంచి యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం, ముఖం కలిగే చికాకు. ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. శెనగపిండిలో కొన్ని రకాల పదార్థాలను కలిసి చర్మానికి ఉపయోగించటం వల్ల అద్భుతాన్ని చూస్తారు.. పూర్తి వివరాల్లోకి వెళితే…

శెనగపిండిలో రెండు స్పూన్ల తాజా క్రీమ్, ఒక టీ స్పూన్ తేనె కలిపి రాస్తే చాలు మీ అందం రెట్టింపు అవుతుంది. ఇందుకోసం ముందుగా, ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల శనగపిండిని జల్లెడ పట్టి అందులో వేయండి. ఆ తర్వాత దానికి ఫ్రేష్‌ క్రీమ్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో తేనె వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ని మీ ముఖం, మెడ, చేతులు, కాళ్ళపై కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వండి. ప్యాక్ ఆరిన తర్వాత, సాధారణ నీటితో కడిగేసుకోవాలి. మీ చర్మం మృదువుగా మారటం మీరు గమనిస్తారు.

మీరు ప్రతిరోజూ శనగపిండి, తేనె, క్రీమ్ ప్యాక్ అప్లై చేస్తే, మీ చర్మం శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది. ఇది చర్మం నుండి మురికి, చర్మంపై మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మంపై మచ్చలు ఉంటే, మీరు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు, మీ చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

సాధరణంగా వేసవిలో చర్మం చెమట కారణంగా జిడ్డుగా మారుతుంది. ఎండకు బాగా కందిపోయినట్టుగా మారుతుంది. అలాంటప్పుడు తరచూ ముఖానికి శెనగపిండి ప్యాక్‌లను అప్లై చేయటం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భ
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న భ
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!