Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా..? కన్నయ్య మాటల్లో అసలైన ప్రేమ గురించి తెలుసుకోండి..!

ప్రేమ అనేది మనసులో నుంచి వచ్చేసే స్వచ్ఛమైన భావన. ఈ ప్రేమలో ఏ విధమైన స్వార్థం లేకుండా ఎదుటి వారికి మంచిని కోరడం, వారి సంతోషంలో సంతోషపడడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రేమ నిజమైన అర్థాన్ని వివరించారు. ఇది త్యాగం, అంకితభావం, క్షమ అనే ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటుంది.

నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా..? కన్నయ్య మాటల్లో అసలైన ప్రేమ గురించి తెలుసుకోండి..!
Bhagavad Gita Teachings
Follow us
Prashanthi V

|

Updated on: Apr 14, 2025 | 9:22 PM

ప్రేమ అనేది మనసులో నుంచి వచ్చేసే స్వచ్ఛమైన భావన. ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం ప్రేమకు అర్థం. కాలం ఎలా మారినా.. ప్రేమ అనే భావన మాత్రం ఎప్పటికీ మారదు. నిజమైన ప్రేమ అనేది.. మన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడం ఎదుటి వారి సంతోషంలో మనం సంతోషపడటం. ఇది కేవలం ఒక ఫీలింగ్‌ మాత్రమే కాదు.. జీవితాన్ని మార్చే గొప్ప అనుభూతి కూడా.

ఈ రోజుల్లో ప్రేమ అర్థం చాలా మారిపోయింది. చాలా మంది ప్రేమను ఒక హక్కుగా చూస్తున్నారు. ఎవరికైనా మనపై ఇష్టం వస్తే వారిని మనమే పొందాలనే అహంభావంతో ఉండటం చూస్తున్నాం. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. ఇది మన ఆశలు, స్వార్థంతో కలిసిన భావం మాత్రమే.

శ్రీమద్ భగవద్గీత మనకు నిజమైన ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తుంది. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లుగా ప్రేమ అనేది ఒప్పందం కాదు, లావాదేవీ కాకూడదు. అది పూర్తిగా త్యాగం, అంకితభావంతో కూడినదై ఉండాలి. నిజమైన ప్రేమలో అహం అనే భావం ఉండదు. ఎవరో ఒకరినీ సంపూర్ణంగా అర్థం చేసుకొని తమని తామే మరచిపోయి.. వాళ్ల మంచి కోసం మనం చేసే త్యాగమే అసలైన ప్రేమకి నిజమైన అర్థం.

ప్రేమంటే ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకుండా జీవించగలగడం. మనకున్నదానితో సంతోషించగలగడం. త్యాగం చేయగల మనసు ఉండే వ్యక్తి ప్రేమను పవిత్రంగా నిలబెట్టగలడు. ప్రేమకు ప్రతిఫలం ఆశించకపోతేనే అది ఆధ్యాత్మిక స్థాయికి చేరుతుంది. ప్రేమకు బదులుగా ఏదైనా ఆశించటం వల్ల అది స్వార్థంతో కలిసిన భావనగా మారిపోతుంది.

ఎంతో ప్రయత్నించినా ప్రేమను పొందలేకపోతే మనం తలకిందులవ్వాల్సిన పనిలేదు. భగవద్గీత ప్రకారం ఆ భావనను భగవంతుని పాదాల చెంత ఉంచాలి. అంటే ప్రేమ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. అది ఒక దారిని విడిచి మరో దారిని అనుసరిస్తుంది. అప్పుడు ఆ ప్రేమ భగవంతునితో మన సంబంధానికి మూలంగా మారుతుంది. దీన్ని భక్తిగా మారిన ప్రేమగా చెప్పవచ్చు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు.. దేవుడి అసలైన స్వరూపాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వారు బాధపడరు, లోపాలు లేకుండా నిబ్బరంగా ఉంటారు. అలానే ఎవరో ఒకరిపై నిస్వార్థ ప్రేమ చూపిస్తూ.. తన మనసునే ప్రేమగా మార్చుకున్నవాడు కూడా ఎవరి ప్రేమ కోసం తపించడు. ఎందుకంటే అతని హృదయం అప్పటికే దైవ ప్రేమతో నిండిపోతుంది. అది అంతర్గత సంతోషాన్ని అనుభవించే స్థితి.

భగవద్గీతలో చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రేమలో ఫలితం ఆశించకూడదు. ప్రేమ అనేది లావాదేవీ కాదు. అది త్యాగం, క్షమ, అంకితభావంతో కూడిన జీవిత మార్గం. ఎవరి కోసం అయినా త్యాగం చేయగల సామర్థ్యం ఉన్నవాడు నిజంగా ప్రేమను అర్థం చేసుకున్నవాడవుతాడు.

ప్రేమ అంటే స్వచ్ఛత, త్యాగం, అంకితభావం. ఇది ఎప్పటికీ మారని ఆధ్యాత్మిక విలువ. భగవద్గీత ద్వారా మనకు ప్రేమలోని నిజమైన అర్థం తెలుస్తుంది. మనం ప్రేమను ఎలా చూపించాలో, ఎలా నిస్వార్థంగా జీవించాలో ఇది బోధిస్తుంది. ఈ ప్రేమను మన జీవితంలో మార్గదర్శకంగా తీసుకుంటే మన జీవితంలో సంతోషం, శాంతి ఉంటుంది.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..