Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కలలో ఇవి కనిపిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చినట్లే..! ఇక డబ్బే.. డబ్బు..!

మన జీవితంలో కలలు మనకు ఒక ప్రత్యేకమైన సంకేతంగా మారవచ్చు. ప్రతి కలకు ప్రత్యేకమైన అర్థం ఉంటుంది.. కొన్ని మనకు మంచి పరిణామాలను సూచిస్తాయి, మరికొన్ని అపశకునంగా భావిస్తారు. కొన్ని కలలు ధనసంపద, శుభదాయక పరిణామాలను సూచించే సంకేతాలుగా కూడా మారవచ్చు.

మీ కలలో ఇవి కనిపిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చినట్లే..! ఇక డబ్బే.. డబ్బు..!
Wealth And Prosperity Dreams
Follow us
Prashanthi V

|

Updated on: Apr 14, 2025 | 6:11 PM

ప్రతి మనిషి జీవితంలో కలలు ఒక భాగం. కొన్ని కలలు వ్యర్థమైన భావాలే అనిపించవచ్చు కానీ కొన్ని కలలు మాత్రం మన భవిష్యత్‌పై ప్రభావం చూపే సంకేతాలుగా భావిస్తారు. ఇది స్వప్నశాస్త్రం ఆధారంగా చెబుతోంది. మనకు కనిపించే ప్రతీ కలకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. కొన్ని కలలు మంచిని సూచిస్తే.. మరికొన్ని అపశకునంగా భావిస్తారు. అయితే కొన్ని ప్రత్యేక కలలు మనకు త్వరలోనే ధనసంపద వచ్చేస్తుందని సంకేతాలివ్వగలవు. అలాంటి 7 కలలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దీపం

కలలో మీరు ఒక దీపం వెలుగుతున్నట్టు చూస్తే.. అది చాలా మంచి సంకేతం. దీపం వెలుగుతో ఉండటం అంటే అంధకారాన్ని తొలగించడమే. అదే విధంగా మీ జీవితం నుండి కష్టకాలం తొలగిపోయి.. శుభకాలం ప్రారంభమవుతుందని ఇది తెలియజేస్తుంది. అదృష్టం మీ వైపు మొగ్గు చూపుతుందని అర్థం.

చెవి ఆభరణాలు

మీరు కలలో చెవులకు ఆభరణాలు వేసుకున్నట్టుగా చూస్తే.. అది త్వరలో మీకు ధనం సమృద్ధిగా రానుందనే సంకేతంగా పరిగణించవచ్చు. ప్రత్యేకించి ఎక్కడి నుండైనా అనుకోకుండా డబ్బు రావచ్చు. ఇది మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది.

ఉంగరం

కలలో మీరు మీ చేతికి ఉంగరం వేసుకున్నట్టుగా కనిపిస్తే.. అది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉందనే సంకేతం. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, స్థిరమైన సంపద మీ దారిలో ఉందని అర్థం.

పువ్వులు

గులాబీ, కమలం ఈ రెండు పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. మీరు కలలో వీటిని చూస్తే అది ఓ శుభ సూచకంగా పరిగణించాలి. ఈ కల శుభదాయకంగా భావించబడుతుంది. మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.. త్వరలోనే మీరు ధనసంపద పొందే అవకాశం ఉంది అనే సూచన ఇది.

పాలు తాగడం

కలలో మీరు పాలు తాగుతున్నట్టుగా చూస్తే.. అది మీ ఇంట్లో అభివృద్ధి, శాంతి, ధనం చేరుతాయని సూచిస్తుంది. పాలు తాగడం ఆరోగ్యం, సంపదకు సూచనగా కూడా చెప్పవచ్చు. త్వరలో మీరు ఓ నూతన స్థాయికి చేరుకుంటారు.

పాములు

పాములు చాలా మందికి భయాన్ని కలిగించవచ్చు. కానీ కలల్లో పాము కనిపించడం మాత్రం మంచిదిగా పరిగణిస్తారు. ఇది మీ జీవితంలో ధనప్రవాహం పెరిగే అవకాశం ఉందనే సంకేతం. ఓ పెద్ద లాభం లేదా ఆస్తి మీకు దక్కవచ్చని భావించవచ్చు.

ఈ విధంగా మీ కలలు మీ భవిష్యత్తు పై వెలుగునిచ్చే దీపాల్లా మారుతాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే.. మనకు వస్తున్న అవకాశాలను ముందే గ్రహించవచ్చు. కలలు కేవలం స్వప్నాలుగా కాకుండా.. కలలు మనకు దారి చూపే సంకేతాలుగా కూడా ఉండొచ్చు, కాబట్టి వాటిని తేలికగా తీసుకోకూడదు.