Watch: వార్నీ.. ఇదేం పంచాయతిరా సామీ.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న యువతీ యువకులు..
సహస్రధారలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీడియోలో కనిపించిన బైక్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల సహస్త్రధార పర్యాటక ప్రాంతానికి తరుచూ ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది యువతీ, యువకులు కూడా వెళ్లారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ముగ్గురు యువకులు, ఇద్దరు యువతుల మధ్య ఘర్షణ జరిగి పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. ఇదంతా వీడియో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సహస్రధారలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీడియోలో కనిపించిన బైక్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
Hello @DehradunPolice
You arrested all 3 boys who beat up a woman, but haven’t taken any action on these women who are beating up the man. Why this discrimination?pic.twitter.com/Kp13OrdzxA
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 14, 2025
వీడియోలో కనిపించిన ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారిపై పోలీస్ చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రెండు స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ప్రత్యేక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..