AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముసలి నక్క.. ఆలయంలో ఉన్నామన్న సోయి కూడా లేకుండా.. యువతిపై

ఇతగాడిని ఏమని అనాలో మీరే చెప్పండి.. ఎలాంటి శిక్ష వేయాలో వెల్లడించండి. వచ్చింది దేవాలయానికి.. వయస్సు 50 ఏళ్ల వరకు ఉంటుంది. రిటైర్మెంట్ వయసులో గుడిలో తన కామ వాంఛలతో రెచ్చిపోయాడు. సమీపంలో కూర్చున్న యువతిని అసభ్యకరంగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత......

Viral Video: ముసలి నక్క.. ఆలయంలో ఉన్నామన్న సోయి కూడా లేకుండా.. యువతిపై
Harassment At Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 15, 2025 | 8:01 AM

చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నాడు. వయసు 50 ఏళ్ల వరకు ఉంటుంది. వచ్చింది పవిత్ర దేవాలయానికి. కానీ అతడి పాడుబుద్ధి చూస్తే మీరే తిట్టిపోస్తారు. కనీసం సభ్యత, సంస్కారం లేకుండా బిహేవ్ చేశాడు ఆ వ్యక్తి. గుడికి వచ్చిన ఓ యువతిని అసభ్యకరంగా ఫోటోలు తీశాడు. ఆపై ఆమెపై తదేకంగా చూడటం ప్రారంభించాడు. అతని ప్రవర్తన కాసేపు ఓపికగా భరించిన ఆ యువతి.. ఇక సహనం నశించి నేరుగా అతని వద్దకు వెళ్లి ప్రశ్నించింది. ఫోన్ ఓపెన్ చేయించి గ్యాలరీలో ఉన్న తన కాళ్ల ఫోటోలను చూపించి.. ఎందుకు ఫోటోలు తీశారని ప్రశ్నించింది. అందరు ముందు ఆ యువతి కాళి దేవీలా మారి ప్రశ్నించడంతో.. ఆ వ్యక్తి నీళ్లు నమిలాడు. ఆ యువతి ఫోటోలను తన ఫోన్ నుంచి డిలీట్ చేశాడు. అయితే ఆ యువతి ప్రశ్నిస్తుండగా చుట్టూ ఉన్న ఎవరూ ఆమెకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. ఆ యువతికి తండ్రి వయసులో ఉండి.. అతను చేసిన పనిపై నెటిజన్స్ భగ్గుమంటున్నారు. చివరికి దేవాలయాల్లో కూడా మహిళలకు రక్షణ కరువైందని కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమాజంలో విచ్చలవిడి చేష్టలు పెరిగిపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పవచ్చు. మౌంట్ అబూలోని డెల్వాడ జైన ఆలయం వెలుపల ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అతనిపై కేసు నమోదు అయ్యిందా.. లేదా లాంటి వివరాలు తెలియరాలేదు. ఈ తరహా ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. మిగిలినవారికి భయం ఉంటుందని… మహిళా సంఘాలు వారు చెబుతున్నారు.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..