AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఎప్పుడూ తినని రుచితో కొబ్బరి చట్నీ..! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..!

ఇవాళ మంచి సౌత్ ఇండియన్ రెసిపీతో మీ ముందుకు. ఇవాళ్టి మన రెసిపీ కొబ్బరి చట్నీ. ఇది దోసె, ఇడ్లీ, వడ, ఊతప్పం లాంటి టిఫిన్లకు చాలా బాగుంటుంది. ఇంట్లోనే తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ చట్నీ రుచి మీకు తప్పకుండా నచ్చుతుంది.

మీరు ఎప్పుడూ తినని రుచితో కొబ్బరి చట్నీ..! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..!
Traditional Coconut Chutney Recipe
Follow us
Prashanthi V

|

Updated on: Apr 14, 2025 | 10:05 PM

కొబ్బరి చట్నీ అనేది సౌత్ ఇండియా వంటకాల్లో చాలా బాగుంటుంది. దోసె, ఇడ్లీ, వడ, ఊతప్పం లాంటి టిఫిన్లకు ఇది సూపర్ కాంబినేషన్. దీన్ని ఇంట్లోనే తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదలరు. అంత బాగుంటుంది. ఈ చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • తాజా తురిమిన కొబ్బరి – 1 కప్పు
  • వేయించిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి – 2 లేదా 3
  • అల్లం ముక్క – 1 చిన్నది
  • వాటర్ – 1/4 కప్పు
  • ఉప్పు – తగినంత
  • నూనె – 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు – 1/2 టీస్పూన్
  • మినపప్పు – 1/2 టీస్పూన్
  • ఇంగువ – చిటికెడు
  • కరివేపాకు – 6 నుంచి 8

తయారీ విధానం

ముందుగా పచ్చి కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి తురుము వేస్తే చట్నీ మెత్తగా వస్తుంది. తర్వాత ఒక చిన్న గిన్నెలో కొంచెం నూనె వేసి అందులో శనగపప్పు వేయించాలి. ఇలా చేస్తే చట్నీకి మంచి వాసన, రుచి వస్తాయి. శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం కడిగి చిన్నగా తరుగుకోవాలి. ఈ తాజా వాటితో చట్నీకి మంచి రుచి వస్తుంది.

ఇప్పుడు కొబ్బరి తురుము, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లు తక్కువగా వేసుకుంటే చట్నీ క్రీమ్‌లా ఉంటుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొంచెం నూనె వేడి చేసి అందులో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడినప్పుడు కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ వేసి వేయించాలి. తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తయారైన తాలింపును మిక్సీలో రుబ్బిన కొబ్బరి చట్నీలో వేసి బాగా కలిపితే, ఎంతో రుచికరమైన సౌత్ ఇండియన్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది.

ఇది వేడి వేడి దోస, ఇడ్లీ, వడ, ఊతప్పంతో తింటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఈ చట్నీ చేసుకొని మీ కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.

ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం.. ది బెస్ట్ ప్లాన్ ఇదే..!
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్‌ SASA LELE సేల్‌.. 50 శాతం తగ్గింపు!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
కొత్త ఫీచర్‌.. Gmailలో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణుల సూచనలివే..!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే