Washing Machine: ఈ బట్టలు వాషింగ్ మెషీన్‌లో అస్సలు వేయొద్దు.. పొరపాటున వేస్తే ప్రమాదమే..
వాషింగ్ మెషిన్ ఉంది కదా అని అన్నీ రకాల బట్టలు వేస్తున్నారా.. అయితే మీ వాషింగ్ మెషిన్ పాడైపోయే ప్రమాదముంటుంది. కొన్ని దస్తులను మాత్రమే మెషీన్‌లో వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అన్నింటిని వేస్తే వాషింగ్ మెషిన్ దెబ్బతినే ప్రమాదముంటుందని నిపుణులు చెబుతున్నారు.

వాషింగ్ మెషీన్.. ఇప్పుడు ప్రతీఒక్కరి ఇళ్లల్లో తప్పనిసరిగా ఇది ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దుస్తులు త్వరగా ఉతకడం, సింపుల్‌గా పని పూర్తవ్వడంలో ఇది సహాయపడుతుంది. అయితే చాలామంది ఏం ఆలోచించకుండా ప్రతీ దానిని వాషింగ్ మెషీన్‌లో వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టం జరుగుతుంది. కొన్ని రకాల దుస్తులను అసలు వాషింగ్ మెషీన్‌లో వేయకూడదు. ఈ బట్టలపై ఉండే కేర్ ట్యాగ్‌ను పరిశీలించిన తర్వాతనే వాషింగ్ మెషీన్‌లో వేయాలని లాండ్రీ నిపుణులు చెబుతున్నారు. కొన్ని దుస్తులను వస్తే వాషింగ్ మెషీన్ దెబ్బతిని పనిచేయకుండా పోయే అవకాశముంటుంది. అసలు వాషింగ్ మెషీన్‌లో వేయకూడదని దుస్తులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వీటిని ఎట్టి పరిస్థితుల్లో వేయకండి..
ఇసుకతో నిండిన తువ్వాళ్లు, పెంపుడు జంతువుల వెంట్రుకలతో నిండిన దుప్పట్లు, బురద పట్టిన బట్టలతో పాటు బాగా మురికిపట్టిన దుస్తులను వాషింగ్ మెషీన్‌లో వేయకూడదు. వీటిని వేస్తే వాషింగ్ మెషిన్ పాడైపోయే అవకాశముంటుంది. దీంతో అలాంటివాటిని వాషింగ్ మెషిన్‌లో వేసే సమయంలో వాటిని ముందుగా చెత్తబుట్టపై దులపండి. ఆ తర్వాతనే వాషింగ్ మెషిన్‌లో వేయండి. ఇక గట్టి మెమరీ ఫోడ్ దిండ్లు వాషింగ్ మెషిన్‌లో వేయకూడదు. వాషింగ్ మెషిన్ వేగంగా తిరగడం వల్ల ఫోమ్ దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఫోమ్ చిరిగిపోయే అవకాశముంటుంది. కేవలం దిండు కవర్లను మాత్రమే వాషింగ్ మెషిన్‌లో వేయాల్సి ఉంటుందని లాండ్రి నిపుణులు చెబుతున్నారు. ఇక బాగా బరువు ఉన్న దుప్పట్లను కూడా వాషింగ్ మెషిన్‌లో వేయకపోవడం మంచిది. ఇక పెద్ద మెషిన్లు 22 నుంచి 24 పౌండ్ల బరువును మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో ఒకేసారి 20 పౌండ్ల వరకు బట్టలను వేయడం వల్ల మెషిన్ సామర్థ్యం అనేది దెబ్బతింటుంది. అందుకే 15 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉన్న దుప్పట్లను వాషింగ్ మెషిన్‌లో వేయవద్దని నిపుణులు చెబుతున్నారు.
డ్రై క్లీన్ అని లేబుల్ ఉంటే..
అలాగే డ్రైక్లీన్ ఓన్లీ అనే లేబుల్ ఉన్న దుస్తులను వాషింగ్ మెషిన్‌లో వేయకండి. వాటిని వాషింగ్ మెషీన్‌లో వేయడం వల్ల రంగు పోవడం, చిరిగిపోవడం వంటి ప్రమాదాలు ఉంటాయి. ఇక సిల్క్, స్యూడ్, లేస్ వంటి సున్నితమైన దుస్తులను కూడా మెషిన్‌లో వేయకూడదు. ఇక తోలు దుస్తులను కూడా వేయకూడదు. వీటిని వేయడం వల్ల తోలు ఉడిపోయే అవకాశముంటుంది. అలాగే బట్టులు వేసే ముందు జేబుల్లో ఏమైనా వస్తువులు ఉన్నాయోమనని చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే వాషింగ్ మెషిన్‌లో వేయండి.
