AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Pickle: ముక్క ముక్కలోనూ అద్భుతమైన రుచి.. నోరూరించే పక్కా పల్లెటూరి స్టైల్ మటన్ నిల్వ పచ్చడి

Mutton Niluva Pachadi: మన ఇంట్లో ఎన్ని కూరలున్నా, వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని తింటే ఆ తృప్తే వేరు. అందునా అది నాన్‌వెజ్ పచ్చడి అయితే ఇక చెప్పక్కర్లేదు. మాంసాహార ప్రియులకు అమితంగా నచ్చే వంటకాల్లో 'మటన్ నిల్వ పచ్చడి' ముందుంటుంది. చాలామందికి మటన్ పచ్చడి అంటే ఇష్టం ఉన్నా, అది ఇంట్లో చేయడం కష్టమని లేదా ముక్క గట్టిగా అయిపోతుందని భయపడుతుంటారు.

Phani CH
|

Updated on: Jun 13, 2026 | 8:04 PM

Share
 కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ సరైన కొలతలతో చేసుకుంటే, ముక్క సాఫ్ట్‌గా ఉంటూ నోట్లో వేస్తే కరిగిపోయేలా అద్భుతంగా వస్తుంది. నెలల తరబడి నిల్వ ఉండే ఈ కమ్మని పచ్చడిని పక్కా ఆంధ్రా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా ఎముకలు లేని లేత మటన్ ముక్కలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, నీరు అస్సలు లేకుండా పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం.

1 / 5
తడి ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఆ తర్వాత ఒక కడాయిలో మటన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించాలి. మటన్ నుండి వచ్చే నీరంతా పూర్తిగా ఇమిడిపోయే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఉడికించిన మటన్ ముక్కలను వేసి దోరగా వేయించాలి.

2 / 5
ఇక్కడే మనం జాగ్రత్త పడాలి; ముక్కలను మరీ ఎక్కువగా వేయిస్తే గట్టిగా రబ్బరులా అయిపోతాయి, తక్కువగా వేయిస్తే పచ్చడి పాడవుతుంది. కాబట్టి ముక్కలు చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి విడిగా తీసుకోవాలి. అదే నూనెలో తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించుకోవాలి.

3 / 5
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, నూనె కొద్దిగా చల్లారిన తర్వాత అందులో వేయించిన మటన్ ముక్కలు, తగినంత కారం, గరం మసాలా, వేయించిన ఆవాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం కలిపితే పచ్చడి చేదు వచ్చే ప్రమాదం ఉంది.

4 / 5
ఈ విధంగా చేసుకున్న మటన్ పచ్చడిని ఒక రోజంతా అలాగే ఊరనివ్వాలి. మరుసటి రోజుకి ముక్కలకి మసాలాలన్నీ పట్టి, నూనె పైకి తేలి పచ్చడి ఎంతో సువాసనతో నోరూరిస్తుంది. ఈ పచ్చడిని తడి లేని గాజు సీసాలో భద్రపరుచుకుంటే రెండు నుండి మూడు నెలల పాటు అస్సలు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ మటన్ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ఇంట్లో ప్రయత్నించి చూడండి, ఇంట్లో వాళ్లంతా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

5 / 5
Follow Us
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..

వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!

కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!

నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?

అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..

మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే

సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..

21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన

విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా